Assam: ఉమ్మడి పౌరస్మృతి అమలు దిశగా అస్సాం కీలక నిర్ణయం

ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు దిశగా అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లిం వివాహ, విడాకుల నమోదు చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది.

Published : 23 Feb 2024 23:54 IST

దిస్పూర్‌: ఉమ్మడి పౌరస్మృతి (యూసీసీ) అమలు దిశగా అస్సాం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ముస్లిం వివాహ, విడాకుల నమోదు చట్టాన్ని రద్దు చేయాలని నిర్ణయించింది. దీనికి రాష్ట్ర కేబినెట్‌ ఆమోదం తెలిపినట్లు ఆ రాష్ట్ర మంత్రి జయంత మల్ల బారుహా శుక్రవారం వెల్లడించారు. ఫిబ్రవరి 28 వరకు జరగనున్న అసెంబ్లీ సమావేశాల్లో ఈ బిల్లును ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్లు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. ఒకవేళ ఇది కార్యరూపం దాలిస్తే యూసీసీని అమలు చేసేందుకు ముందుకొచ్చిన రెండో రాష్ట్రంగా అస్సాం నిలిచినట్లవుతుంది. 

ఇప్పటికే ఉత్తరాఖండ్‌ అసెంబ్లీ యూసీసీ బిల్లును ఆమోదించిన విషయం తెలిసిందే. దీనికి గవర్నర్‌ ఆమోద ముద్రవేస్తే దేశంలోనే ఉమ్మడి పౌరస్మృతిని అమలు చేసే తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ నిలవనుంది. ఈ బిల్లు అమల్లోకి వస్తే వివాహం, విడాకులు, భూములు, ఆస్తులు, వారసత్వం వంటి విషయాల్లో కులమతాలతో సంబంధం లేకుండా ఒకే నిబంధనలు వర్తించనున్నాయి. గిరిజనులకు మాత్రం ఈ బిల్లు వర్తించదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని