Congress: ‘ఇలాగే అయితే 2 కోట్ల ఉద్యోగాల భర్తీకి 16.66 లక్షల రోజులు!’
ఉద్యోగ కల్పన విషయంలో భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్ మరోసారి విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం కేంద్రం ఏటా 4,374 ఉద్యోగాలు కల్పిస్తోందని గుర్తుచేస్తూ.. ఇదే వేగంతో నియామకాలు చేపడితే రెండు కోట్ల ఉద్యోగాల భర్తీకి ఏకంగా 16.66 లక్షల రోజులు పడుతుందని పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రణదీప్ సూర్జేవాలా ఎద్దేవా చేశారు.
దిల్లీ: ఉద్యోగ కల్పన విషయంలో భాజపా ప్రభుత్వంపై కాంగ్రెస్(Congress) మరోసారి విమర్శలు గుప్పించింది. ప్రస్తుతం కేంద్రం ఏటా 4,374 ఉద్యోగాలు కల్పిస్తోందని గుర్తుచేస్తూ.. ఇదే వేగంతో నియామకాలు చేపడితే రెండు కోట్ల ఉద్యోగాల భర్తీకి ఏకంగా 16.66 లక్షల రోజులు పడుతుందని పార్టీ సీనియర్ నేత, రాజ్యసభ ఎంపీ రణదీప్ సూర్జేవాలా(Randeep Surjewala) ఎద్దేవా చేశారు. గత మూడేళ్లలో ప్రభుత్వం ఎన్ని ఉద్యోగాలు కల్పించిందని పార్లమెంట్‌లో అడిగిన ప్రశ్నకు కేంద్రం నుంచి వచ్చిన లిఖితపూర్వక సమాధానాన్ని ఆయన ఈ సందర్భంగా ఉటంకించారు.
‘యువతకు ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాల హామీ బూటకమేనని నరేంద్ర మోదీ ప్రభుత్వం అంగీకరించింది. గత మూడేళ్లలో కేంద్రం ఏడాదికి 4,374 చొప్పున ఉద్యోగాలు ఇచ్చింది. అంటే రోజుకు 12 ఉద్యోగాలు అన్నమాట. ఇదే వేగంతో ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలంటే.. ఒక ఏడాదికి 16,66,667 రోజులు అవసరం. మోదీజీ ఇప్పుడు ఒక ఏడాదిలో రోజులను 365 నుంచి 16,66,667లకు మార్చనున్నారా?’ అని సూర్జేవాలా వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.
యూపీఎస్సీ భర్తీలపై కేంద్రం స్పందిస్తూ.. ‘పరీక్షల ఆధారంగా గత మూడేళ్లలో యూపీఎస్సీ.. 13,122 మందిని నియామకం కోసం సిఫార్సు చేసింది’ అని సూర్జేవాలాకు ఇచ్చిన సమాధానంలో పేర్కొంది. ఆయా గ్రూపు ఉద్యోగాల్లో ఖాళీల సంఖ్యపై బదులిస్తూ.. గతేడాది మార్చి 1 నాటికి గ్రూప్ ఏ, బీ, సీల్లో వరుసగా 23,584; 1,18,807; 8,36,936 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు వెల్లడించింది. ఇదిలా ఉండగా.. ఏడాదికి రెండు కోట్లమందికి ఉద్యోగాలు కల్పిస్తామంటూ ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రధాని నరేంద్ర మోదీ నిలబెట్టుకోలేకపోయారని ప్రతిపక్ష నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్న విషయం తెలిసిందే.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
Sports News
IND vs AUS: విరాట్‌ని ఆపకపోతే ఆస్ట్రేలియా గెలవడం చాలా కష్టం: ఆసీస్ మాజీ కెప్టెన్
-
India News
Cow Hug day: ఫిబ్రవరి 14 వాలంటైన్స్ డే కాదు.. కౌ హగ్ డే..!
-
World News
Operation Dost: విభేదాలున్నా.. తుర్కియేకు భారత్ ఆపన్నహస్తం..!
-
Movies News
Social Look: రుహానీ శర్మ రెడ్ రోజ్.. ప్రణీతకు బోర్ కొడితే?
-
General News
Andhra News: సీబీఐ విచారణ కోరుతూ రఘురామ పిటిషన్.. కేంద్రం, సీబీఐకి నోటీసులు జారీ
-
Movies News
Dhanush: ఈ రోజు నాకెంతో ప్రత్యేకం: ధనుష్