Ayodhya Result: ‘నిజమైన రాజుకు ద్రోహం చేశారు’: అయోధ్య ఫలితంపై ‘రామాయణ్’ నటుడు

Ayodhya Result: అయోధ్యలో భాజపా ఓటమిపై రామాయణ్‌ నటుడు సునీల్‌ లాహ్రీ అసంతృప్తి వ్యక్తం చేశారు. నిజమైన రాజుకు అయోధ్య వాసులు ద్రోహం చేశారని ఆగ్రహించారు.

Published : 06 Jun 2024 11:17 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: శ్రీరాముడి జన్మభూమి అయోధ్య క్షేత్రం ఉన్న ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఫైజాబాద్‌ లోక్‌సభ స్థానంలో భాజపా (BJP) ఓటమిపాలవడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ కమలం అభ్యర్థి, సిట్టింగ్‌ ఎంపీ లల్లూ సింగ్‌పై సమాజ్‌వాదీ పార్టీ దళిత నేత అవధేశ్‌ ప్రసాద్‌ విజయం సాధించారు. ఈ ఫలితం (Ayodhya Result)పై ‘రామాయణ్‌’ ధారావాహికలోని లక్ష్మణ పాత్రధారి సునీల్‌ లాహ్రీ (Sunil Lahiri) అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ మేరకు తన ఇన్‌స్టా ఖాతాలో ఓ వీడియో సందేశం విడుదల చేశారు.

‘‘ఈ ఎన్నికల ఫలితాలు (Lok Sabha Elections) తీవ్రంగా నిరాశపర్చాయి. నాడు అరణ్యవాసం నుంచి తిరిగొచ్చిన తర్వాత అయోధ్యలో సీతాదేవిని శంకించిన విషయాన్ని మనం మర్చిపోయాం. ఇప్పుడు మళ్లీ అలాంటి పరిస్థితులే కన్పిస్తున్నాయి. స్వయంగా దేవుడే ప్రత్యక్షమైనా వారు ఆయనను తిరస్కరిస్తారు. అయోధ్య ఎప్పుడూ నిజమైన రాజుకు ద్రోహం చేస్తూనే ఉంది. ఆనాడు సీతాదేవినే వదల్లేదు. అలాంటిది.. ఇప్పుడు శ్రీరాముడిని టెంట్‌ నుంచి దివ్యమందిరం (Ayodhya Ram Mandir)లోకి తీసుకొచ్చిన వారిని మోసం చేయకుండా ఎలా ఉంటారు? ఈ దేశం మిమ్మల్ని ఎప్పటికీ దయతో చూడదు’’ అంటూ సునీల్‌ అసహనం వ్యక్తం చేశారు.

అయ్యో.. రామా!.. అయోధ్యలో భాజపా ఓటమికి ఎన్నో కారణాలు

అయితే ఈ ఎన్నికల్లో కంగనా రనౌత్‌, అరుణ్‌ గోవిల్‌ విజయం సాధించడం పట్ల ఆయన ఆనందం వ్యక్తం చేశారు. ‘రామాయణ్‌ (Ramayan Serial)’లో అరుణ్ గోవిల్‌ శ్రీరాముడి పాత్రధారిగా నటించి ‘టీవీ రాముడి’గా పేరొందిన విషయం తెలిసిందే. తాజా ఎన్నికల్లో ఆయన యూపీలోని మేరఠ్‌ నుంచి విజయం సాధించారు. ఇక, బాలీవుడ్‌ నటి కంగనా రనౌత్‌ హిమాచల్‌ ప్రదేశ్‌లోని మండి స్థానం నుంచి గెలుపొందారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు