City Centre Mall: తండ్రి చేతుల్లోంచి జారిపడి పసికందు మృతి

తమ ఇద్దరు కుమారులతో సరదాగా గడుపుదామని మాల్‌కు వెళ్లిన ఓ కుటుంబంలో విషాదం మిగిలింది. అప్పటివరకు అల్లరి చేస్తూ, ముసిముసి నవ్వులు నవ్వుతూ తనతో ఆడిన కుమారుడు ఇక లేడనే విషయాన్ని తట్టుకోలేని ఆ తండ్రి రోదనలు అక్కడి వారిని కన్నీరు పెట్టించాయి. 

Published : 20 Mar 2024 19:48 IST

రాయ్‌పూర్: ఛత్తీస్‌గఢ్‌లో రాయ్‌పూర్‌లోని సిటీ సెంటర్ మాల్‌లో మంగళవారం ఓ కుటుంబం షాపింగ్‌కు వెళ్లింది. తండ్రి తన ఇద్దరు కుమారులతో మూడో అంతస్తులో ఎస్కలేటర్‌ వద్ద నిలబడగా.. ఐదేళ్ల కుమారుడు దాని పైకి ఎక్కడానికి ప్రయత్నించాడు. తండ్రి బాలుడిని ఆపడానికి ప్రయత్నిస్తున్న క్రమంలో పట్టుతప్పి అతని చేతుల్లో ఉన్న ఏడిదిన్నర చిన్నారి కిందపడిపోయాడు.  ఈ హఠాత్పరిణామంతో ఆ వ్యక్తి షాక్‌కు గురయ్యాడు. వెంటనే తేరుకొని గుండెలవిసేలా రోదిస్తూ చిన్నారిని వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే పసికందు చనిపోయినట్లుగా డాక్టర్లు  నిర్ధారించారు. తాము అల్లారుముద్దుగా పెంచుకుంటున్న తమ చిన్నారి తిరిగిరాని లోకాలకు వెళ్లాడనే విషయాన్ని జీర్ణించుకోలేక ఆ తండ్రి రోదిస్తున్న తీరు అక్కడి వారిని కలచివేసింది. మాల్‌లో ఉన్న సీసీ కెమెరాలో ఈ ఘటనకు సంబంధించిన ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు