Sheikh Hasina: మోదీ ప్రమాణస్వీకారం.. దిల్లీ చేరుకున్న షేక్‌ హసీనా

నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొనేందుకు బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా శనివారం దిల్లీ చేరుకున్నారు.

Published : 08 Jun 2024 16:33 IST

దిల్లీ: బంగ్లాదేశ్‌ ప్రధాని షేక్‌ హసీనా (Sheikh Hasina) దిల్లీ చేరుకున్నారు. వరుసగా మూడోసారి నరేంద్ర మోదీ (PM Modi) ప్రధానిగా ఆదివారం ప్రమాణస్వీకారం (swearing ceremony) చేయనున్న సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఒకరోజు ముందుగానే ఆమె దిల్లీ వచ్చారు. విమానాశ్రయానికి చేరుకున్న షేక్‌ హసీనాకు.. అధికారులు ఘనస్వాగతం పలికారు. విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించిన వివరాల మేరకు..  మోదీ ప్రమాణ స్వీకారోత్సవానికి శ్రీలంక అధ్యక్షుడు రణిల్‌ విక్రమ్‌సింఘే, మాల్దీవుల అధ్యక్షుడు ముయిజ్జు, నేపాల్‌ ప్రధాని పుష్ప కమల్‌ దహల్‌ ప్రచండ, మారిషస్‌ ప్రధాని ప్రవింద్‌ కుమార్‌, భూటాన్‌ ప్రధాని తోబ్గే తదితర విదేశీ ప్రముఖులు హాజరుకానున్నారు. 

ఆదివారం సాయంత్రం 7.15 గంటలకు రాష్ట్రపతి భవన్‌లో ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం జరగనుంది. ఈనేపథ్యంలో దిల్లీ వ్యాప్తంగా భద్రతను కట్టుదిట్టం చేశారు. స్థానిక పోలీసులతోపాటు కీలక ప్రాంతాల్లో ఎన్‌ఎస్‌జీ బలగాలు పహారా కాస్తున్నాయి. దిల్లీని నో ఫ్లై జోన్‌గా ప్రకటించారు. మరికొన్ని రోజుల పాటు దిల్లీ, పరిసర ప్రాంతాల్లో డ్రోన్లు, పారాగ్లైడర్లు, రిమోట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌లను నిషేధించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని