Railway: రైల్వే ‘బీస్ట్‌’ను చూశారా..? వైరల్‌ అవుతున్న వీడియో

Beast of Indian Railways: అత్యంత శక్తిమంతమైన ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ వీడియోను రైల్వే శాఖ ఎక్స్‌లో పోస్ట్‌ చేసింది. దాన్ని రైల్వే బీస్ట్‌గా అభివర్ణించింది.

Updated : 04 Dec 2023 21:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: స్వదేశీ పరిజ్ఞానం, అధునాతన సాంకేతికతతో రైల్వేకు కొత్త హంగులు తెచ్చేందుకు కేంద్రం విస్తృతంగా కృషి చేస్తోంది. ఆ అభివృద్ధి పనులను రైల్వే శాఖ (Railways Ministry) ఎప్పటికప్పుడు తమ సామాజిక మాధ్యమాల్లో షేర్‌ చేస్తోంది. అధునాతన రైళ్లకు సంబంధించిన వీడియోలు.. ఆధునికీకరించిన స్టేషన్ల దృశ్యాలను పంచుకుంటోంది. తాజాగా భారత అత్యంత శక్తిమంతమైన ఎలక్ట్రిక్‌ లోకోమోటివ్‌ (Electric Locomotive) వీడియోను రైల్వే తమ ఎక్స్‌ ఖాతాలో షేర్‌ చేసింది. దాన్ని ‘బీస్ట్‌ ఆఫ్‌ ఇండియన్‌ రైల్వేస్‌ (Beast of Indian Railways)’గా అభివర్ణించింది.

రైల్వే శాఖ తాజాగా స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన ‘వాగ్‌12బీ’ ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌ ఇది. తాజాగా పోస్ట్‌ చేసిన వీడియోలో.. అత్యంత శక్తిమంతమైన ఈ రైలు ఇంజిన్‌ డబుల్‌ డెక్కర్‌ను తలపించేలా కార్గో బోగీలను తీసుకెళ్తోంది. ఈ వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

12,000 హార్స్‌పవర్ సామర్థ్యం కలిగిన ఈ ఎలక్ట్రిక్ లోకోమోటివ్‌లు దేశంలోని అత్యంత శక్తివంతమైన స్వదేశీ లోకోమోటివ్‌లు. మేక్‌ ఇన్‌ ఇండియా ప్రోగ్రామ్‌లో భాగంగా వీటిని అభివృద్ధి చేశారు. ఇవి గరిష్ఠంగా గంటకు 120కి.మీల వేగంతో 6వేల టన్నుల బరువు వరకు లాక్కెళ్లగలవు. అంతకుముందు తీసుకొచ్చిన వాగ్‌-9 లోకోమోటివ్‌లతో పోలిస్తే వీటి సామర్థ్యం రెండింతలు ఎక్కువని రైల్వే శాఖ గతంలో వెల్లడించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని