currency notes: మెడలో గడియారం.. కరెన్సీ నోట్లు గాల్లోకి విసిరేస్తూ..!
బెంగళూరులోని రద్దీ ప్రాంతంలో ఓ యువకుడు ఫ్లై ఓవర్ పై నుంచి కరెన్సీ నోట్లను గాల్లోకి విసిరాడు. వీటిని ఏరుకునేందుకు జనం గుమిగూడటంతో ట్రాఫిక్ జామ్ అయ్యింది.
బెంగళూరు: అది బెంగళూరు (Bengaluru)లో రద్దీగా ఉండే ఆర్కే మార్కెట్ కూడలి. నిత్యం వందలాది మంది వివిధ అవసరాల కోసం అక్కడికి వస్తుంటారు. ఆ కూడలిలో ఉన్న పైవంతెన (flyoverZ) పైకి హఠాత్తుగా ఓ యువకుడు కొంతమంది అనుచరులను వెనకేసుకొని వచ్చాడు. సంచీ లోంచి డబ్బులు (Currency notes) తీసి గాల్లోకి ఎగరేశాడు. వాటిని ఏరుకునేందుకు ఫ్లై ఓవర్ కింద జనం గుమిగూడారు. దీంతో మార్కెట్ ప్రాంతంలో వాహనాలు నిలిచిపోయి, భారీగా ట్రాఫిక్ జామ్ (Traffic Jam) అయ్యింది. దీనికి సంబంధించిన దృశ్యాలను అక్కడున్న వారు తమ సెల్‌ఫోన్లలో రికార్డు చేసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేయడంతో వైరల్‌గా మారాయి.
ఎందుకిలా చేసినట్లు..
ఆ యువకుడు సూట్ ధరించి ప్రొఫెషనల్‌గా ఉన్నాడు. అంతేకాకుండా మెడలో గోడగడియారం వేలాడదీసుకున్నాడు. అలాగని ఖరీదైన నోట్లను కూడా గాల్లోకి విసర్లేదు. కేవలం 10 రూపాయల నోట్లనే విసిరినట్లు అక్కడున్న వారు చెబుతున్నారు. ఈ మొత్తం దాదాపు రూ.3000 ఉండొచ్చని అంటున్నారు. కొందరు ఫ్లై ఓవర్ కింద నోట్లను ఏరుకుంటుంటే.. మరికొందరు మాత్రం ఫ్లైఓవర్‌పై అతడిని డబ్బులు అడిగారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు అక్కడికి చేరుకునేలోపే ఆ యువకుడు అక్కడి నుంచి వెళ్లిపోయాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించినందుకు అతడిపై కేసు నమోదు చేశామని తెలిపారు. ఉద్దేశ పూర్వకంగా ఇలాంటి చర్యలకు పాల్పడటం వెనక ఉన్న కారణాలపై ఆరా తీస్తున్నామన్నారు.
ఇవీ చదవండి
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
India News
Vande Bharat Express: అన్ని హంగులున్న ‘వందే భారత్’లో చెత్తా చెదారం
-
General News
Viveka Murder case: వివేకా హత్య కేసు.. సీబీఐ విచారణకు ఎంపీ అవినాష్‌రెడ్డి హాజరు
-
Movies News
Naga Vamsi: ‘ఈ పాప బుట్టబొమ్మలా లేదా?’ విలేకరికి నిర్మాత కౌంటర్
-
Sports News
IND vs NZ: మీకిష్టమైన బిర్యానీ దొరకలేదని.. ఇక రెస్టారంట్‌కు వెళ్లకుండా ఉంటారా..?: వాషింగ్టన్
-
General News
Taraka Ratna: విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి: వైద్యులు
-
General News
Viveka murder case: వివేకా హత్య కేసు.. ఆ ఐదుగురికి హైదరాబాద్ సీబీఐ కోర్టు సమన్లు