Nyay Yatra: భారత్ జోడో న్యాయ్ యాత్రలో ప్రియాంకగాంధీ

రాహుల్ గాంధీ నేతృత్వంలో యూపీలో కొనసాగుతున్న  భారత్ జోడో న్యాయ్ యాత్ర శనివారం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్ నుంచి తిరిగి ప్రారంభమైంది.

Published : 24 Feb 2024 14:51 IST

లఖ్‌నవూ: రాహుల్ గాంధీ నేతృత్వంలో కొనసాగుతున్న  భారత్ జోడో న్యాయ్ యాత్ర శనివారం ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్(Moradabad) నుంచి తిరిగి ప్రారంభమైంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ వాద్రా(Priyanka Gandhi Vadra) ఈ యాత్రలో పాల్గొన్నారు. ఆదివారం అమ్రోహా, సంభాల్, బులంద్‌షెహర్, అలీగఢ్‌, హత్రాస్, ఆగ్రా మీదుగా సాగి ఫతేపూర్ సిక్రీ వద్ద యాత్ర ముగుస్తుందని కాంగ్రెస్‌ తెలిపింది. సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) ఆదివారం ఆగ్రాలో జరిగే కాంగ్రెస్ యాత్రలో పాల్గొంటారు.

‘‘తిరిగి ప్రారంభమైన భారత్‌ జోడో న్యాయ్‌ యాత్రలో రాహుల్‌గాంధీ, ప్రియాంక వాద్రాలకు వివిధ వర్గాల ప్రజలు స్వాగతం పలికారు’’ అని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధికార ప్రతినిధి మనీష్ హింద్వి (Manish Hindvi) మీడియాకు తెలిపారు. యాత్ర చందౌలీలోకి ప్రవేశించిన సమయంలో ప్రియాంక గాంధీ యాత్రలో పాల్గొనవలసి ఉంది. అనారోగ్యం కారణంగా ఆమె యాత్రలో చేరలేదు. ఆదివారంతో యాత్ర రాజస్థాన్‌లోని ధోల్‌పూర్‌లో ముగుస్తుంది. ఫిబ్రవరి 27, 28 తేదీల్లో  కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలో రాహుల్‌ గాంధీ రెండు ప్రత్యేక ఉపన్యాసాలు ఇవ్వడానికి యూకే వెళ్తుంండటంతో  ఫిబ్రవరి 26 నుంచి మార్చి1 వరకు యాత్రకు విరామం ఇవ్వనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి. మార్చి 2న ధోల్‌పూర్ నుంచి యాత్ర తిరిగి ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్‌ మీదుగా రాష్ట్రంలోని ఇతర జిల్లాలతో పాటు మొరెనా, గ్వాలియర్, శివపురి, గుణ, షాజాపూర్, ఉజ్జయినిలలో కొనసాగుతుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు