Swati Maliwal: స్వాతీ మాలీవాల్‌ కేసులో బిభవ్‌ ముంబయికి తరలింపు

స్వాతీ మాలీవాల్‌ కేసులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న దిల్లీ సీఎం సహాయకుడు బిభవ్ కుమార్‌ను నేడు దిల్లీ పోలీసులు ముంబయికి తీసుకెళ్లారు.

Published : 21 May 2024 17:24 IST

దిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) ఎంపీ స్వాతీ మాలీవాల్‌ (Swati Maliwal) పై దాడి చేసిన కేసులో అరెస్టయిన బిభవ్ కుమార్‌ (Bibhav Kumar)ను దిల్లీ పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ముంబయి తీసుకెళ్లింది. అతడు సాక్ష్యాలను ధ్వంసం చేయడానికి తన ఐఫోన్‌ను ఫార్మాట్‌ చేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.  ఫార్మాట్ చేసిన ఐఫోన్ లోని డేటాను సేకరించడానికి వారు ముంబయికి వెళ్లారు. 

స్వాతీ మాలీవాల్‌ ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బిభవ్ పై కేసు నమోదు చేసిన రెండు రోజుల అనంతరం శనివారం అతన్ని అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆయన ఐదు రోజుల జ్యుడీషియల్ కస్టడీలో ఉన్నారు.

‘‘మే 13న సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal) నివాసంలో కూర్చున్న నావద్దకు బిభవ్‌ వచ్చి దాడికి దిగాడు. 7-8 సార్లు చెంపపై కొట్టాడు. ఛాతి, కడుపుపై కాలితో తన్నాడు. పరిగెడుతుంటే నా చొక్కా పట్టుకొని వెనక్కి లాగాడు. పొత్తి కడుపులో విపరీతమైన నొప్పితో నడవలేకపోయా. ఎలాగోలా అతని నుంచి తప్పించుకుని బయటకు వచ్చి పోలీసులకు ఫోన్‌ చేశా’’ అని స్వాతి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. శుక్రవారం దిల్లీ పోలీసులు మాలీవాల్‌ను కేజ్రీవాల్ నివాసానికి తీసుకెళ్లి సీన్‌ రీక్రియేషన్‌ చేశారు. మెజిస్ట్రేట్‌ ముందు ఆమె వాంగ్మూలాన్ని రికార్డ్‌ చేశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు