JP Nadda: జేపీ నడ్డా సతీమణి కారు అపహరణ!

JP Nadda: దిల్లీలోని గోవిందపురి ప్రాంతంలో జేపీ నడ్డా సతీమణి కారు టయోటా ఫార్చునర్‌ అపహరణకు గురైనట్లు తెలిసింది. దీనిపై డ్రైవర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Updated : 25 Mar 2024 07:32 IST

దిల్లీ: భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డా (JP Nadda) సతీమణి కారును గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు సమాచారం. దిల్లీలోని గోవిందపురి ప్రాంతంలో కనిపించకుండా పోయినట్లు తెలుస్తోంది. మార్చి 19న మధ్యాహ్నం 3 గంటల సమయంలో ఈ ఘటన జరిగినట్లు ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించారు.

వారు తెలిపిన వివరాల ప్రకారం.. టయోటా ఫార్చునర్‌ కారును డ్రైవర్‌ జోగిందర్‌ సర్వీసింగ్‌ నుంచి తీసుకొచ్చారు. నడ్డా నివాసానికి చేరుకునే క్రమంలో మధ్యలో తన ఇంటి వద్ద భోజనం కోసం కారును బయట నిలిపి ఉంచాడు. ఆ సమయంలో దుండగులు కారును అపహరించారు. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించగా.. కారును గురుగ్రామ్‌ దిశగా తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఎంత గాలింపు చేపట్టినా ఇప్పటి వరకు ఎలాంటి ఆచూకీ లభించలేదు. అపహరణకు గురైన కారు హిమాచల్‌ప్రదేశ్‌ రిజిస్ట్రేషన్‌ నంబర్‌తో ఉంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు