Devendra Fadnavis: ఎన్సీపీతో భాజపాది వ్యూహాత్మక పొత్తు: దేవేంద్ర ఫడ్నవీస్

రాష్ట్రంలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీతో భాజపాకు వ్యూహాత్మక పొత్తు, శివసేనతో భావోద్వేగ బంధం ఉందని దేవేంద్ర ఫడ్నవీస్ తెలిపారు.

Published : 23 Feb 2024 19:51 IST

ముంబయి: రాష్ట్రంలో అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ(NCP)తో భాజపాకు వ్యూహాత్మక పొత్తు ఉందని మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis)  అన్నారు. ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నేతృత్వంలోని శివసేన(Shiv Sena)తో తమ పార్టీకి భావోద్వేగ బంధం ఉందని తెలిపారు. భాజపాకు అధికార వ్యతిరేకత లేదని, ఎన్నికలకు ముందు ప్రతిపక్షాలను టార్గెట్ చేయాల్సిన అవసరం లేదని ఆయన అన్నారు.

ఫడ్నవీస్ 'ఐడియాస్ ఆఫ్ ఇండియా' సమ్మిట్ 3.0లో పాల్గొని ప్రసంగించారు. నరేంద్రమోదీ ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తంచేశారు. మహారాష్ట్రలో భాజపా మెరుగ్గా రాణిస్తుందా అనే విషయంపై మాట్లాడుతూ చాలా సవాళ్లున్నాయి. కానీ గతంలో మా పనితీరు కంటే మరింత మెరుగ్గా చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. 

తాను ముఖ్యమంత్రిగా పాటించిన ఎజెండానే ఉప ముఖ్యమంత్రిగా కూడా పాటిస్తున్నానన్నారు. భాజపా కిందిస్థాయి నుంచి బలంగా ఉంది. పార్టీకి కార్యకర్తలే పెద్ద ఆస్తి. కాంగ్రెస్ కార్యకర్తలు తమ నాయకులను చూసి ఆందోళన చెందుతున్నారని ఆయన అన్నారు.

రాష్ట్రంలో ఈ ఏడాది జరగనున్న అసెంబ్లీ ఎన్నికల గురించి ఫడ్నవీస్ మాట్లాడుతూ, ఎన్సీపీ, శివసేనలతో పొత్తు రానున్న ఎన్నికల్లోనూ కొనసాగుతుంది. ఏక్‌నాథ్ షిండే మా నాయకుడు, ఆయన నేతృత్వంలోనే అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తాం." అని అన్నారు. భాజపాతో ఎన్ని పార్టీలు చేతులు కలిపినా పార్టీ సిద్ధాంతమే ముఖ్యమని ఉప ముఖ్యమంత్రి అన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని