Stray Dogs: చాక్లెట్ల కోసం వెళ్లిన బాలుడిపై వీధి కుక్కలు ఎలా దాడి చేశాయో చూశారా?

ఏడేళ్ల బాలుడిపై వీధికుక్కలు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. ప్రస్తుతం అతడు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

Updated : 14 Aug 2023 17:30 IST

లఖ్‌నవూ: ఏడేళ్ల బాలుడిపై వీధి శునకాలు (Stray Dogs) దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. వాళ్ల అమ్మ ఇంటి పనుల్లో నిమగ్నమై ఉండగా ఆ బాలుడు చాక్లెట్లు కొనుక్కోవడానికి బయటకొచ్చాడు. నాలుగడుగులు వేశాడో లేదో.. అంతలోనే ఐదు కుక్కలు విరుచుకుపడ్డాయి. కక్ష పెంచుకొని మరీ దాడి చేసినట్లుగా ఎక్కడబడితే అక్కడ కాట్లు వేశాయి. ఆ బాలుడు భయంతో అరవడంతో చుట్టుపక్కల వారు వచ్చి.. వాటిని తరిమేశారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఝాన్సీ పట్టణంలో చోటు చేసుకుంది. తీవ్రగాయాల పాలైన అతడికి ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దాడికి సంబంధించిన దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని