సీఏఎఫ్‌ కమాండర్‌ మృతి.. గొడ్డలితో నరికి చంపిన మావోయిస్టులు

సీఏఎఫ్‌ కమాండర్‌ను మావోయిస్టులు గొడ్డలితో నరికి హతమార్చారు. ఛత్తీస్‌గఢ్‌లోని బీజాపూర్‌ జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది.

Published : 18 Feb 2024 19:32 IST

రాయ్‌పుర్: ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లో ఓ జవానుపై మావోయిస్టులు దుశ్చర్యకు పాల్పడ్డారు. కూరగాయలు కొనుగోలు చేసేందుకు వెళ్లిన సీఏఎఫ్‌ కమాండర్‌పై గొడ్డలితో దాడి చేశారు. ఈ ఘటన బీజాపూర్ జిల్లాలో ఆదివారం ఉదయం 9:30 గంటల ప్రాంతంలో చోటుచేసుకుంది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దర్భ డివిజన్‌ కుట్రు పోలీస్ స్టేషన్ పరిధిలోని పోలీసు క్యాంపు నుంచి తేజు రామ్‌ భూర్య కూరగాయలు తీసుకురావటానికి సిబ్బందితో కలసి బయల్దేరాడు. అకస్మాత్తుగా మావోయిస్టులు అక్కడకు వచ్చి రామ్‌పై గొడ్డలితో దాడి చేశారు. దీంతో బాధితుడు అక్కడికక్కడే మరణించాడు. వెంటనే భద్రతా సిబ్బంది శిబిరంలోని బలగాలను అప్రమత్తం చేశారు. అదనపు దళాలతో సంఘటనా స్థలానికి చేరుకునే సమయానికి దుండగులు అక్కడ నుంచి తప్పించుకున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని