Supreme Court: విచారణకు ముందు ఎక్కువ రోజులు జైలులో ఉంచలేం: మద్యం కేసులో సుప్రీం కీలక వ్యాఖ్యలు

విచారణకు ముందు నిందితులను ఎక్కువ రోజులు జైలులో ఉంచలేమని సుప్రీం ధర్మాసనం వ్యాఖ్యానించింది. 

Updated : 08 Dec 2023 13:33 IST

దిల్లీ: విచారణకు ముందు నిందితులను ఎక్కువ రోజులు జైలులో ఉంచడం సరైన చర్య కాదని సుప్రీం కోర్టు వ్యాఖ్యానించింది. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో నిందితుడిగా ఉన్న పెర్నాడ్‌ రికార్డ్‌ ఇండియా ప్రతినిధి బినోయ్‌ బాబు బెయిల్‌ పిటిషన్‌పై శుక్రవారం విచారణ జరిపిన సుప్రీం ధర్మాసనం.. ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. ఈ సందర్భంగా దర్యాప్తు సంస్థల వ్యవహారశైలిపై జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా, జస్టిస్‌ ఎస్వీఎన్‌ భట్టి ధర్మాసనం పలు వ్యాఖ్యలు చేసింది. 

‘‘విచారణకు ముందు నిందితులుగా ఉన్న వ్యక్తులను ఎక్కువ కాలం జైలులో ఉంచడం సరైంది కాదు. నిందితులపై ఈడీ, సీబీఐ చేసిన ఆరోపణల మధ్య వ్యత్యాసం ఉంది. ఈ విచారణ ఎలా సాగుతుందో తెలియడం లేదు’’ అని జస్టిస్‌ సంజీవ్‌ ఖన్నా వ్యాఖ్యానించారు. దిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన బినోయ్‌ బాబు గత 13 నెలలుగా జైలులో ఉన్నారు. ఇదే విషయాన్ని బెయిల్‌ పిటిషన్‌పై విచారణ సందర్భంగా ఆయన తరపు న్యాయవాది హరీష్ సాల్వే సుప్రీం ధర్మాసనానికి తెలియజేశారు. ఈ సందర్భంగా బినోయ్‌ బాబు బెయిల్‌ పిటిషన్‌లో లేవనెత్తిన అంశాల ఆధారంగా ఆయనకు సుప్రీం కోర్టు బెయిల్ మంజూరు చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని