Rahul gandhi: నీ ఆటోగ్రాఫ్‌ ఇస్తావా..? చిన్నారిని అడిగిన రాహుల్

ఆదివారం ఊటీలోని చాక్లెట్‌ ఫ్యాక్టరీని సందర్శించిన కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ ఓ చిన్నారితో సంభాషించిన తీరు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. అందుకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్‌ పార్టీ సోషల్‌ మీడియాలో పంచుకుంది.

Updated : 28 Aug 2023 12:44 IST

దిల్లీ : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) గత కొన్ని రోజులుగా వరుస టూర్లతో ప్రజలను కలిసిన వీడియోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఊటీలో ఒక చాక్లెట్‌ తయారీ కర్మాగారాన్ని సందర్శించిన రాహుల్.. దానికి సంబంధించిన వీడియోను ఆదివారం సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

అక్కడ కార్మికులతో కలిసి చాక్లెట్ ఎలా తయారు చేస్తారో నేర్చుకున్నారు. అక్కడ పనిచేస్తున్న వారు అందరూ మహిళలేనని.. వారు చేసిన తరహా చాక్లెట్లను ఇప్పటివరకు తాను రుచి చూడలేదని ప్రశంసించారు. వారితో ముచ్చటిస్తుండగా ఓ చిన్నారి నోట్‌ బుక్‌తో రాహుల్ వద్దకు వచ్చి ఆటో గ్రాఫ్‌ (autograph) అడిగింది.  రాహుల్ వెంటనే ఆ చిన్నారికి ఆటోగ్రాఫ్‌ ఇచ్చి.. మీరు నాకు సహాయం చేయగలరా ? అని అడిగారు. అప్పుడు ఆ పాప నవ్వి సరే అని తెలిపింది. అనంతరం ‘మీ ఆటోగ్రాఫ్‌ నాకు ఇవ్వగలరా?’ అని రాహుల్ గాంధీ అదే నోట్ బుక్‌ను చిన్నారికి అందించారు. ఆ పాప నవ్వుతూ.. రాహుల్‌కు ఆటోగ్రాఫ్ ఇచ్చింది. దీంతో అక్కడ ఉన్నవారంతా ఆనందంతో చప్పట్లు కొట్టి .. రాహుల్‌ను ప్రశంసించారు. ఈ వీడియోను కాంగ్రెస్‌ పార్టీ ఎక్స్‌ (ట్విటర్‌)లో పంచుకుంది. రాహుల్ కూడా తన అధికారిక ఖాతాలో పంచుకుంటూ.. ‘ఊటీలోని ప్రముఖ ‘మోడీస్‌ చాక్లెట్స్‌’ (Moddys Chocolates) పరిశ్రమను సందర్శించే అవకాశం రావడం సంతోషం’ అని రాసుకోచ్చారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని