Railways: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే పనులపై కేంద్రం గుడ్‌న్యూస్‌!

తెలుగు రాష్ట్రాల్లో రైల్వే లైన్ల అభివృద్ధికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. బీబీనగర్‌-గుంటూరు లైన్‌ డబ్లింగ్‌కు ఆమోదం తెలిపింది. అలాగే, భారీ వ్యయంతో మరికొన్ని లైన్ల విస్తరణకు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది.

Updated : 16 Aug 2023 19:46 IST

దిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో రైల్వే లైన్ల విస్తరణ పనులకు సంబంధించి కేంద్ర కేబినెట్‌(Union Cabinet) కీలక నిర్ణయాలు తీసుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు తొమ్మిది రాష్ట్రాల్లో ఏడు మల్టీ-ట్రాకింగ్‌ ప్రాజెక్టులకు ఆమోదం తెలిపింది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే.. గుంటూరు-బీబీనగర్‌(Guntur-Bibinagar) మార్గం డబ్లింగ్‌కు కేంద్రం ఆమోదం తెలిపింది. దాదాపు రూ.3,238.38 కోట్ల అంచనా వ్యయంతో 272.69 కి.మీల మేర డబ్లింగ్‌ పనులు చేపట్టాలని నిర్ణయించింది. అలాగే, రూ.5,655.4 కోట్ల అంచనా వ్యయంతో డోన్-మహబూబ్ నగర్; మేడ్చల్-ముద్ఖేడ్ (మొత్తంగా 502.34 కి.మీ) మధ్య డబ్లింగ్‌కు ఆమోదం తెలిపింది. నెర్గుండి- బారాంగ్‌; కుర్దా రోడ్‌ - విజయనగరం మధ్య (417.6 కి.మీలు) రూ.5,618.26 కోట్ల అంచనా వ్యయంతో మూడో లైన్‌ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదముద్ర వేసింది. 

దేశంలో రైల్వే లైన్ల విస్తరణ, రైళ్ల రాకపోకలను క్రమబద్ధీకరించడం, రద్దీని తగ్గించడమే లక్ష్యంగా చర్యలు చేపడుతున్నట్టు పేర్కొంది. మొత్తం రూ.32,500కోట్ల అంచనా వ్యయంతో ఉత్తరప్రదేశ్‌, బిహార్‌, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌, ఒడిశా, ఝార్ఖండ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాల్లోని 35 జిల్లాల పరిధిలో ప్రస్తుతమున్న రైల్వే నెట్‌వర్క్‌లను విస్తరించనున్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు