Chhattisgarh: మరో మూడు రోజుల్లో ఎన్నికల వేళ.. భాజపా నేత హత్య!

ఛత్తీస్‌గఢ్‌లో మరో మూడు రోజుల్లో తొలి దశ పోలింగ్‌ సిద్ధమైన నారాయణపుర్‌ అసెంబ్లీ నియోజకవర్గంలో భాజపా నేత రతన్‌ దుబే హత్యకు గురయ్యారు.

Published : 04 Nov 2023 19:47 IST

రాయ్‌పుర్‌: మరో మూడు రోజుల్లో తొలి దశ ఎన్నికలనగా.. ఛత్తీస్‌గఢ్‌ (Chhattisgarh)లోని బస్తర్‌ ప్రాంతంలో భాజపా నేత హత్య కలకలం రేపింది. పార్టీ నారాయణపుర్‌ జిల్లా ఉపాధ్యక్షుడు, అసెంబ్లీ కన్వీనర్‌ రతన్‌ దుబే (Ratan Dubey) హత్యకు గురయినట్లు పోలీసులు వెల్లడించారు. నక్సలైట్లే (Naxalites) ఈ ఘాతుకానికి పాల్పడినట్లు అనుమానిస్తున్నామని తెలిపారు. ఇక్కడి కౌశల్‌నగర్‌ ప్రాంతంలో శనివారం ఆయన ఎన్నికల ప్రచారంలో ఉండగా.. పదునైన ఆయుధంతో హతమార్చారని చెప్పారు. నిందితులను పట్టుకునేందుకు గాలింపు ముమ్మరం చేశామన్నారు.

భాజపా సీనియర్‌ నేత ఓం ప్రకాశ్‌ మాథుర్‌ ఈ హత్య ఘటనను తీవ్రంగా ఖండించారు. దీన్ని పిరికిపంద చర్యగా అభివర్ణించారు. అక్టోబరు 20న సైతం రాష్ట్రంలోని నక్సల్స్‌ ప్రభావిత ప్రాంతమైన మోహ్లా మన్‌పుర్‌ అంబాగఢ్‌ చౌకీ జిల్లాలో ఓ భాజపా కార్యకర్త హత్యకు గురైన విషయం తెలిసిందే. భాజపా కార్యకర్తలను లక్ష్యంగా చేసుకుని ఈ హత్యలకు పాల్పడుతున్నారని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఆ సమయంలో కాంగ్రెస్‌పై ఆరోపణలు చేశారు. ఈ క్రమంలోనే మరో హత్య చోటుచేసుకోవడం చర్చనీయాంశంగా మారింది.

‘మహాదేవ్‌’ పేరునూ వదిలిపెట్టలేదు..! కాంగ్రెస్‌పై ప్రధాని మోదీ ధ్వజం

ఇదిలా ఉండగా.. ఛత్తీస్‌గఢ్‌లో ఈ నెల 7న తొలిదశ ఎన్నికలు జరగనున్న 20 అసెంబ్లీ నియోజకవర్గాల్లో నారాయణపుర్‌ ఒకటి. అయితే.. రాష్ట్రంలో ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచ్చిన మావోయిస్టులు.. విధ్వంసాలకు పాల్పడుతున్నారు. ఇటీవలే కాంకేర్‌ జిల్లా చోటా బెథియా పోలీసుస్టేషన్‌ పరిధిలోని పఖంజూర్‌ ప్రాంతంలో పోలీసు ఇన్‌ఫార్మర్లనే నెపంతో ముగ్గురు గ్రామస్థులను, జాపూర్‌ జిల్లా ఊసూరు పోలీసుస్టేషన్‌ పరిధిలో ఒకరిని చంపేశారు. మరో ఘటనలో రెండు వాహనాలను తగులబెట్టారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని