Himachal rains: వర్ష బీభత్సానికి ‘హిమాచల్‌’ విలవిల.. కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంల సాయం!

వర్ష బీభత్సంతో అతలాకుతలమైన హిమాచల్‌కు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు సాయం ప్రకటించారు. తమ రాష్ట్రానికి సాయం చేయాలని హిమాచల్‌ప్రదేశ్‌ సీఎం సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు విజ్ఞప్తి చేశారు.

Updated : 19 Aug 2023 16:51 IST

(వరద బాధితులతో మాట్లాడుతున్న హిమాచల్‌ ప్రదేశ్‌ సీఎం)

శిమ్లా: వర్ష బీభత్సంతో వణుకుతున్న హిమాచల్‌ప్రదేశ్‌(Himachal Pradesh)కు కాంగ్రెస్‌ పాలిత రాష్ట్రాల సీఎంలు ఆర్థిక సాయం అందజేశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదలకు కొండచరియలు విరిగిపడటంతో పెద్ద ఎత్తున, ఆస్తి, ప్రాణనష్టం సంభవించిన విషయం తెలిసిందే. దీంతో తొలుత ఛత్తీస్‌గఢ్‌ సీఎం భూపేశ్‌ బఘేల్‌ తమ రాష్ట్రం తరఫున రూ.11కోట్లు సాయంగా అందజేయగా.. తాజాగా రాజస్థాన్‌ ప్రభుత్వం 15 కోట్లు సాయం చేసినట్టు హిమాచల్‌ ప్రదేశ్ సీఎం సుఖ్విందర్‌ సింగ్ సుఖు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కష్ట సమయంలో తమకు సాయం చేసిన రాజస్థాన్‌, ఛత్తీస్‌గఢ్‌ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. మరీ ముఖ్యంగా ఈ విపత్తు సమయంలో హిమాచల్‌ప్రదేశ్‌ ప్రజలు తమకు విరాళాలు అందజేస్తూ మద్దతుగా నిలుస్తున్నారన్నారు. 

రతన్‌ టాటాకు ‘ఉద్యోగరత్న’ తొలి అవార్డు ప్రదానం

ఈ క్లిష్ట పరిస్థితుల్లో తమకు అందుతున్న సాయం విపత్తు బారిన పడిన బాధిత కుటుంబాలను ఆదుకొనేందుకు ఎంతగానో ఉపయోగపడుతుందని సీఎం చెప్పారు. బాధిత ప్రజలకు తగిన సహాయం అందించేందుకు వీలుగా రాష్ట్ర విపత్తు సహాయ నిధికి సాధారణ ప్రజలు, పలు సంస్థలు ఉదారతతో సహకరించాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు.  ఈ వర్షాకాలంలో ఇప్పటివరకు హిమాచల్‌ప్రదేశ్‌కు దాదాపు రూ.10వేల కోట్ల ఆస్తి నష్టం జరిగినట్టు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున సహాయ, పునరావాస కార్యక్రమాలను చేపట్టి, బాధిత ప్రజలను ఆదుకొనేందుకు చర్యలు  చేపట్టిందని తెలిపారు.  కేంద్ర ప్రభుత్వం బృందాన్ని పంపించిందని.. ఇప్పటికే ఆ కమిటీ నివేదిక సమర్పించి ఉంటుందని భావిస్తున్నట్టు చెప్పారు. ఈ వరదల వల్ల పలు ప్రాంతాల్లో భారీ నష్టాన్ని చవిచూశామన్న ఆయన.. మరమ్మతులకు ఏడాది కాలం పట్టొచ్చన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు