Tejashwi: కొందరి చేతుల్లో బందీగా నీతీశ్ కుమార్: తేజస్వీ యాదవ్

పట్నా: బిహార్ మాజీ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ (Tejashwi Yadav) రాష్ట్ర ముఖ్యమంత్రి నీతీశ్ కుమార్ (Nitish Kumar)ను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఓ కార్యక్రమంలో భాగంగా బిహార్ సీఎం నీతీశ్ కుమార్ మరోసారి కూటమి మారతారా? అనే ఊహాగానాలపై మీడియా అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ ఈ ఊహాగానాలకు ఎటువంటి ఆధారాల్లేవని అన్నారు. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటారో ఎవరికీ తెలియదని పేర్కొన్నారు. అయితే నీతీశ్ ముఖ్యమంత్రిగా సమర్థవంతంగా రాష్ట్రాన్ని నడపలేకపోతున్నారనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.
ప్రభుత్వానికి సంబంధించిన విషయాల్లో ఆయన సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం లేదని, ముఖ్యంగా నలుగురు నేతల చేతిలో ఆయన బందీగా మారారని ఆరోపించారు. అందులో ఇద్దరు దిల్లీలో ఉండగా..మరో ఇద్దరు ఆయన పక్కనే ఉన్నారని అన్నారు. అంబేడ్కర్‌పై కేంద్ర మంత్రి అమిత్ షా వ్యాఖ్యల నేపథ్యంలో భాజపాతో దోస్తీపై పునరాలోచించుకోవాలని నీతీశ్‌కు కేజ్రీవాల్ లేఖ రాయగా.. స్పందన మాత్రం జేడీయూకు చెందిన సంజయ్ ఝా నుంచి వచ్చిందని పేర్కొన్నారు. సీఎంకు రాసిన లేఖకు బదులివ్వడానికి ఆయన ఎవరని ప్రశ్నించారు. ఇంత జరుగుతున్నా నీతీశ్ ఎందుకు మౌనం వహిస్తున్నారో తెలిపట్లేదని అన్నారు. దీన్ని బట్టి రాష్ట్రం ఎవరి చేతుల్లో ఉందో ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. నీతీశ్ పాలనలో బిహార్ ప్రజలు ఇంకా ఎన్ని ఇబ్బందులు పడాల్సి వస్తుందో అని తాను ఆందోళన చెందుతున్నట్లు పేర్కొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 - 
                        
                            

బాధితులకు రూ.కోటి పరిహారం ఎప్పుడు చెల్లిస్తారు?: తెలంగాణ హైకోర్టు
 


