Sukhvinder Singh: హిమాచల్‌ సీఎంకు అస్వస్థత.. ఎయిమ్స్‌కు తరలింపు

హిమాచల్ ప్రదేశ్‌ ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు(Sukhvinder Singh Sukhu) అస్వస్థతకు గురయ్యారు. మరిన్ని వైద్యపరీక్షల నిమిత్తం ఆయనను దిల్లీ ఎయిమ్స్‌కు తరలించారు. 

Updated : 27 Oct 2023 13:54 IST

శిమ్లా: అస్వస్థతకు గురైన హిమాచల్ ప్రదేశ్‌(Himachal Pradesh) ముఖ్యమంత్రి సుఖ్విందర్ సింగ్ సుఖు(Sukhvinder Singh Sukhu)ను దిల్లీలోని ఎయిమ్స్‌( AIIMS)కు తరలించారు. వైద్య పరీక్షల నిమిత్తం శుక్రవారం ఆయన్ను ఎయిమ్స్‌కు తీసుకెళ్లినట్లు ఇందిరా గాంధీ మెడికల్‌ కాలేజ్‌ అండ్ హాస్పిటల్‌(IGMCH) మెడికల్‌ సూపరింటెండెంట్‌ వెల్లడించారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి ఆరోగ్యం నిలకడగా ఉందని, అన్ని నివేదికలు సాధారణంగానే ఉన్నాయని చెప్పారు.

భాగస్వామి బతికుండగానే మరో పెళ్లి చేసుకోవాలంటే ప్రభుత్వ అనుమతి తప్పనిసరి

‘బుధవారం రాత్రి నుంచి అన్ని రకాల పరీక్షలు చేశాం. కడుపులో ఇన్ఫెక్షన్‌ ఉన్నట్లు బయటపడింది. మరిన్ని వైద్యపరీక్షల నిమిత్తం దిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించాం’ అని తెలిపారు. శిమ్లాలో సీఎంను పరీక్షించిన వైద్యబృందం కూడా ఆయన వెంట వెళ్లింది. బుధవారం రాత్రి సుఖ్విందర్ సింగ్ అస్వస్థతకు గురయ్యారు. పొత్తికడుపులో నొప్పితో ఆసుపత్రిలో చేరారు. ‘గత కొద్దిరోజులుగా సీఎం విస్తృత పర్యటనలు చేస్తున్నారు. ఈ క్రమంలో ఆయన కొన్నిసార్లు బయట ఆహారం తీసుకోవాల్సి వచ్చింది. దానివల్లే ఆయన ఇన్ఫెక్షన్‌కు గురయ్యారు’ అని సుఖు ప్రధాన మీడియా సలహాదారు వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని