Mumbai: ముంబయి ఎయిర్‌పోర్టులో రూ.19.79 కోట్ల విలువైన కొకైన్‌ పట్టివేత

ముంబయి విమానాశ్రయంలో రూ.19.79 కోట్ల విలువైన  కొకైన్‌ను డీఆర్‌ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు

Published : 25 Mar 2024 15:07 IST

ముంబయి: ముంబయి విమానాశ్రయంలో రూ.19.79 కోట్ల విలువైన  కొకైన్‌ పట్టుబడింది. సియెర్రా లియోన్‌కు చెందిన ఓ మహిళ నుంచి 1,979 గ్రాముల కొకైన్‌ను స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం డీఆర్‌ఐ అధికారులు వెల్లడించారు. దీని విలువ రూ.19.79 కోట్లకు పైగా ఉంటుందని తెలిపారు.

కెన్యాలోని నైరోబీ నుంచి వచ్చిన ఓ మహిళ వద్ద మాదకద్రవ్యాలు ఉన్నాయనే పక్కా సమాచారంతో ఆదివారం ఆమెను కస్టడీలోకి తీసుకున్నట్లు  అధికారులు తెలిపారు. ఆమె వద్ద ఉన్న షూ, మాయిశ్చరైజర్ బాటిల్, షాంపూ బాటిల్‌ల అడుగు భాగంలో తెల్లటి పౌడర్ దాగి ఉన్నట్లు కనుగొన్నామని ఓ అధికారి తెలిపారు. పౌడర్‌ను పరీక్షించగా అది కొకైన్ అని తేలిందన్నారు. మహిళను అరెస్టు చేసి జ్యుడీషియల్‌ కస్టడీకి తరలించామని తెలిపారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా నెట్‌వర్క్‌పై తదుపరి విచారణ కొనసాగుతోందన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని