Drugs: గుజరాత్‌లో రూ.130 కోట్ల విలువైన కొకైన్ పట్టివేత

గుజరాత్‌లోని కచ్‌ జిల్లా గాంధీగామ్‌లో రూ.130 కోట్ల విలువైన కొకైన్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. 

Published : 05 Jun 2024 18:44 IST

గాంధీనగర్‌: గుజరాత్‌లోని కచ్‌ తీరంలో రూ.130 కోట్ల విలువైన కొకైన్‌(cocaine)ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గాంధీధామ్ పట్టణంలోని మితి రోహర్‌ ప్రాంతంలో స్మగ్లర్లు సముద్ర తీరంలో మాదకద్రవ్యాలను దాచి పెట్టారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు తనిఖీలు చేపట్టి 13 ప్యాకెట్ల కొకైన్‌ను పట్టుకున్నారు. దీని విలువ రూ.130 కోట్లకు పైగా ఉంటుందని పేర్కొన్నారు. వీటిని తరలిస్తున్న నిందితులను అదుపులోకి తీసుకున్నారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇదే ప్రాంతంలో రూ.800కోట్ల విలువైన 80 కొకైన్‌ ప్యాకెట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని