Congress-AAP: కాంగ్రెస్‌, ఆప్‌ల మధ్య ఖరారైన సీట్ల సర్దుబాటు

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌, ఆప్‌ (Congress-AAP)లు సీట్ల సర్దుబాటు అంశంపై ఓ కొలిక్కివచ్చాయి.

Published : 24 Feb 2024 14:01 IST

దిల్లీ: రానున్న సార్వత్రిక ఎన్నికల్లో పోటీ అంశంపై కాంగ్రెస్‌ (Congress), ఆప్‌ (APP)ల మధ్య చర్చలు పూర్తయ్యాయి. దిల్లీ, గుజరాత్‌, గోవా, హరియాణాలోని లోక్‌సభ స్థానాలపై సీట్ల సర్దుబాటు కుదిరింది. పొత్తుపై శనివారం విలేకరుల సమావేశంలో ఇరుపార్టీలు క్లారిటీ ఇచ్చాయి. దిల్లీ, హరియాణా, గుజరాత్‌లో కలిసి పోటీ చేస్తుండగా.. గోవా, పంజాబ్‌లో మాత్రం ఒంటరిగా పోటీలోకి దిగనున్నాయి.

దిల్లీలోని ఏడు ఎంపీ స్థానాల్లో నాలుగు చోట్ల ఆప్‌, మూడు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పోటీ చేసేందుకు ఒప్పందం కుదుర్చుకున్నాయి. న్యూదిల్లీ, పశ్చిమ దిల్లీ, దక్షిణ దిల్లీ, తూర్పు దిల్లీల్లో ఆప్‌.. చాందిని చౌక్‌, ఈశాన్య దిల్లీ, వాయువ్య దిల్లీల్లో కాంగ్రెస్‌ బరిలోకి దిగనున్నట్లు పార్టీ నేత ముకుల్‌ వాస్నిక్‌ ప్రకటించారు. 2019లో జరిగిన ఎన్నికల్లో అన్ని స్థానాలను భాజపా గెలుచుకుంది.

ఇక్కడ మాత్రం ఒంటరిగానే..

‘మీ ఇంట్లో గొడవైతే.. నన్ను అనొద్దు’.. మహిళలతో ప్రధాని సరదా సంభాషణ

గుజరాత్‌లో 26 లోక్‌సభ స్థానాలుండగా భరూచ్‌, భావ్‌నగర్‌లో ఆప్‌.. 24 చోట్ల కాంగ్రెస్‌ పోటీ చేయనున్నాయి. ఇప్పటికే కేజ్రీవాల్‌ పార్టీ ఇక్కడ తమ అభ్యర్థులను ప్రకటించింది. 10 ఎంపీ స్థానాలున్న హరియాణాలో తొమ్మిది స్థానాల్లో కాంగ్రెస్‌.. కేవలం కురుక్షేత్రలో ఆప్‌ పోటీ చేయనుంది. ఇక చండీగఢ్‌, గోవాలో ఒంటరి పోరాటానికి సిద్ధమయ్యాయి. వేర్వేరు గుర్తులతో పోటీ చేసినప్పటికీ దిల్లీలోని అన్ని స్థానాలను గెలుచుకునేందుకు కృషి చేస్తామని ఆప్‌ నేత సందీప్‌ పఠాక్‌ పేర్కొన్నారు. ఇదిలా ఉండగా.. ఉత్తరప్రదేశ్‌లోని 80 ఎంపీ స్థానాలపై సమాజ్‌వాదీ పార్టీతో కాంగ్రెస్‌ పొత్తు కుదుర్చుకుంది. 17 చోట్ల హస్తం పార్టీ పోటీ చేయనున్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు