Lok Sabha elections: భాజపా తరపున పోటీ అతిపెద్ద బాధ్యత: అరుణ్ గోవిల్

 రామాయణంలో రాముడి పాత్ర పోషించి ప్రేక్షకులను మెప్పించిన నటుడు అరుణ్ గోవిల్ రానున్న లోక్‌సభ ఎన్నికల్లో  పోటీ చేయనున్నట్లు  భాజపా ఆదివారం ప్రకటించింది. తాజాగా ఈ విషయంపై ఆయన ఎక్స్‌ వేదికగా స్పందించారు. 

Published : 25 Mar 2024 20:31 IST

లఖ్‌నవూ: రామాయణం సీరియల్ లో రాముడి పాత్రను పోషించి ప్రేక్షకుల్ని మెప్పించిన నటుడు అరుణ్ గోవిల్(Arun Govil) రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు భారతీయ జనతా పార్టీ (భాజపా) ఆదివారం ప్రకటించింది. అరుణ్ గోవిల్ తన స్వస్థలమైన మీరట్ నుంచి లోక్‌సభ ఎన్నికల బరిలోకి దిగనున్నారని భాజపా స్పష్టంచేసింది.

అరుణ్‌ గోవిల్‌ తాజాగా ఈవిషయంపై ఎక్స్‌ వేదికగా స్పందించారు. తనకు ఈ అవకాశం ఇచ్చినందుకు భాజపాకు కృతజ్ఞతలు తెలిపారు. ఎటువంటి స్వార్థానికి, అవినీతికి తావులేకుండా ప్రజా సేవకుడిగా, నిజమైన నాయకుడిగా తన కర్తవ్యాన్ని నిర్వర్తిస్తానని తెలిపారు. 

“నన్ను మీరట్ ఎంపీ అభ్యర్థిగా ప్రకటించి ఇంత పెద్ద బాధ్యతను నాకు అప్పగించిన ప్రధాని మోదీకి హృదయపూర్వక కృతజ్ఞతలు. భాజపాపై ప్రజలకున్న విశ్వాసం, అంచనాలను పూర్తిగా నిలబెట్టడానికి నేను అన్నివిధాలా ప్రయత్నిస్తాను..జై శ్రీరామ్ ” అంటూ ఆయన ఎక్స్‌లో రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని