నిందితుడిని అరెస్టు చేసేందుకు.. ఏకంగా ఎమర్జెన్సీ వార్డుకే పోలీసు వాహనం

ఒక నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసు వాహనం ఏకంగా ఎయిమ్స్‌లోని ఎమర్జెన్సీ వార్డులోకే వెళ్లిపోయింది. అసలేమైందంటే..?  

Updated : 23 May 2024 12:04 IST

ఇంటర్నెట్‌డెస్క్: లైంగిక వేధింపుల ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితుడిని అరెస్టు చేసేందుకు పోలీసువాహనం ఏకంగా ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు దూసుకొచ్చింది. ఎయిమ్స్‌ రిషికేశ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. దీనికి సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు ఆన్‌లైన్‌లో వైరల్‌గా మారాయి. ఆ దృశ్యాలు యాక్షన్‌ సన్నివేశాన్ని తలపించాయి. ఇంతకీ ఏం జరిగిందంటే..?

‘స్మోకీ పాన్‌’ తిన్న బాలిక పేగుకు రంధ్రం

సర్జరీ యూనిట్‌లో విధుల్లో ఉన్న సమయంలో నర్సింగ్ ఆఫీసర్ తనను లైంగికంగా వేధించారంటూ రెండురోజుల క్రితం ఒక జూనియర్ డాక్టర్ ఆరోపించారు. అతడు తనకు అసభ్యకర సందేశాలు పంపినట్లు ఆమె పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఇతర వైద్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడిని తొలగించాలంటూ వారు నిరసన చేపట్టారు. ఈ క్రమంలోనే నర్సింగ్ ఆఫీసర్‌ను అరెస్టు చేసేందుకు పోలీసులు రాగా.. బయట ఆందోళన చేస్తున్న సిబ్బందిని చూసి తమ వాహనంతో నేరుగా ఎమర్జెన్సీ వార్డుకు వెళ్లిపోయారు. అనంతరం అతడిని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసు వాహనం లోపలికి వెళ్తున్న వీడియోలో బెడ్లపై పేషెంట్లు కనిపించారు. ఎస్‌యూవీ వస్తుండగా.. కొందరు భద్రతా సిబ్బంది అది వెళ్లడానికి దారిని సిద్ధం చేశారు. అలాగే నిందితుడిని అరెస్టు చేసినప్పుడు పోలీసులు అక్కడి వైద్యులను అదుపు చేయడం ఆ దృశ్యాల్లో కనిపించాయి. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇలా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఘటన నేపథ్యంలో ఎయిమ్స్ యాజమాన్యం అతడిపై సస్పెన్షన్‌ వేటు వేసింది. ఆ శిక్ష సరిపోదని వెంటనే పదవి నుంచి తొలగించాలని డిమాండ్లు వ్యక్తమయ్యాయి. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని