‘స్మోకీ పాన్‌’ తిన్న బాలిక పేగుకు రంధ్రం

ద్రవరూప నైట్రోజన్‌ నింపిన కిళ్లీ.. ‘స్మోకీ పాన్‌’ను తినొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాంటి కిళ్లీ తిన్న ఓ 12 ఏళ్ల బాలిక పేగుకు రంధ్రం పడినట్లు బెంగళూరులోని నారాయణ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు తాజాగా గుర్తించారు.

Published : 23 May 2024 04:03 IST

బెంగళూరు (శివాజీనగర), న్యూస్‌టుడే: ద్రవరూప నైట్రోజన్‌ నింపిన కిళ్లీ.. ‘స్మోకీ పాన్‌’ను తినొద్దని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలాంటి కిళ్లీ తిన్న ఓ 12 ఏళ్ల బాలిక పేగుకు రంధ్రం పడినట్లు బెంగళూరులోని నారాయణ మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు తాజాగా గుర్తించారు. వివాహ రిసెప్షన్‌లో బాలిక స్మోకీ పాన్‌ తినడంతో ఆమె ఆరోగ్యం బాగా క్షీణించింది. కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో చూపించగా బాలిక చిన్నపేగు మొదటి భాగంలో రంధ్రం పడిందని వైద్యులు తేల్చారు. శస్త్రచికిత్స చేసి దెబ్బతిన్న భాగాన్ని తొలగించారు. స్మోకీ పాన్‌లు అనారోగ్య కారకాలని వైద్యులు బుధవారం వెల్లడించారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని