Covid: ముగిసిందంటే భ్రమ పడినట్లే...

ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేసిన కరోనా మహ్మమారి ఉద్ధృతి తగ్గుతోందని అనుకుంటున్న తరుణంలో నేనున్నానంటూ మరోసారి ఉలిక్కిపడేలా చేసింది. ముంబయిలో కొవిడ్‌ కొత్తవేరియంట్‌ ఒమిక్రాన్ ‘ఎక్స్‌ఈ’ తొలి కేసు నమోదైంది

Published : 07 Apr 2022 01:52 IST

దిల్లీ: ప్రపంచ దేశాలను అల్లకల్లోలం చేసిన కరోనా మహ్మమారి ఉద్ధృతి తగ్గుతోందని అనుకుంటున్న తరుణంలో నేనున్నానంటూ మరోసారి ఉలిక్కిపడేలా చేసింది ఒమిక్రాన్‌ ఎక్స్‌ఈ. ముంబయిలో కొవిడ్‌ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ ‘ఎక్స్‌ఈ’ తొలి కేసు నమోదైంది. ఒమిక్రాన్‌ కన్నా పదిరెట్లు వేగంతో వ్యాప్తి ఉంటుందని బ్రిటన్‌ పరిశోధకులు అంచనా వేస్తున్నారు. ఒమిక్రాన్‌ ఉపరకాలైన బీఏ1, బీఏ2ల మిశ్రమ ఉత్పరివర్తనంగా భావిస్తోన్న ఈ వేరియంట్‌ సాంక్రమిత శక్తి అధికంగా ఉన్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. బాధితుల్లో తీవ్ర లక్షణాలు లేనట్లు బృహన్‌ ముంబయి మున్సిపల్ కార్పొరేషన్‌ ప్రకటించినా ప్రజలు అప్రమత్తం అవ్వాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

ఎక్స్‌ఈ వేరియంట్‌లో ఐదు కీలకాంశాలు:

1.ముంబయి నుంచి 230 శాంపిల్స్‌ పంపిస్తే దానిలో ఒకటి ఎక్స్‌ఈ అని ఇంకోటి కప్పా వేరియంట్‌ అని పరిశోధకులు గుర్తించారు.

2. కొత్తగా గుర్తించిన వేరియంట్‌ బీఏ1, బీఏ2లోని మ్యుటేషన్‌గా సూచించారు. ప్రాథమిక అధ్యయనాల ప్రకారం ఇది బీఏ కంటే 9.8 శాతం వృద్ధి ఉంటుంది. దీనిని స్టెల్త్‌ వేరియంట్‌ అని కూడా పిలవచ్చని యూకే ఆరోగ్య సంస్థ వెల్లడించింది.

3. దీన్ని 2022 జనవరి 19 న మొదటిసారి గుర్తించారు.

4. ప్రపంచ ఆరోగ్య సంస్థ కొత్త వేరియంట్‌ వ్యాప్తి ఒమిక్రాన్‌ కన్నా వేగంగా ఉంటుందని వెల్లడించింది.

5. ఇదే కాకుండా ఇంకో రెండు రకాల వేరియంట్‌లను కూడా యూకేలో గుర్తించారు. అవి ఎక్స్‌డీ, ఎక్స్‌ఎఫ్‌. ఇవి ఫ్రెంచ్‌ డెల్టాకు సంబంధించినవిగా చెబుతున్నారు.

చైనాలో 2019లో వుహాన్‌లో కొవిడ్‌ తొలి కేసు నమోదైంది. అప్పటి నుంచి ప్రపంచమంతటా వ్యాపించింది. దీని కారణంగా అంతర్జాతీయ ఆర్థిక వ్యవస్థ కుంటుపడింది. ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, లాక్‌డౌన్లు, వలస కూలీల పాట్లు తలచుకుంటేనే విస్మయానికి గురౌతాం. ప్రపంచవ్యాప్తంగా 61 లక్షల మంది మరణించారు. భారత్‌లో 5 లక్షల 20 వేలకు పైగా మరణాలు సంభవించాయి. ఒక నివేదిక ప్రకారం 19 లక్షల మంది పిల్లలు అనాథలయ్యారు. మొదటి పరివర్తనంలో అంతగా తాకిడి లేకపోయినా, ప్రకృతి విపత్తుకు తీసిపోని కరోనా లాంటి మహమ్మారిని ఎదుర్కొవడానికి భారత వైద్య వ్యవస్థ ఏ మేరకు సిద్ధంగా ఉందో తెలుసుకున్నట్లయింది. డెల్టా వేరియంట్‌ సృష్టించిన బీభత్సం తెలిసిందే. శిశిర కాలంలో చెట్లకు ఆకులు రాలినట్టు ఆక్సిజన్‌ అందక వేలాదిమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. మృతదేహాలను అంత్యక్రియలు నిర్వహించలేక గంటల కొద్ది నిరీక్షించిన ఘటనలు కోకొల్లలు. మూడో ఉద్ధృతిలో వచ్చిన ఒమిక్రాన్‌ స్వల్ప లక్షణాలతో   దాటిపోయింది. ఇప్పుడు వస్తోన్న నాలుగోది ఆ కోవకి చెందినదే అని అంచనా వేస్తున్నారు. అయినా అప్రమత్తత పాటించడం అవసరం. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు