DD Kisan: వార్తలు చదువుతున్నది క్రిష్‌, భూమి.. దూరదర్శన్‌ కిసాన్‌లో ఏఐ యాంకర్లు!

DD Kisan: తొమ్మిదో వార్షికోత్సవం సందర్భంగా డీడీ కిసాన్‌ ఏఐ యాంకర్లను ప్రవేశపెట్టనుంది. ఇవి 50 భాషల్లో మాట్లాడగలవు.

Published : 24 May 2024 15:44 IST

దిల్లీ: రైతుల కోసం ప్రారంభించిన ప్రత్యేక ఛానల్‌ డీడీ కిసాన్‌ (DD Kisan) మే 26తో తొమ్మిదేళ్లు పూర్తి చేసుకోనుంది. ఈసందర్భంగా దూరదర్శన్‌ కీలక నిర్ణయం తీసుకుంది. కృత్రిమ మేధ కాలం నడుస్తున్న తరుణంలో ఏఐ యాంకర్లను ప్రవేశపెట్టనున్నట్లు తెలిపింది. ఏఐ క్రిష్‌ (AI Krish), ఏఐ భూమి (AI Bhoomi) పేరిట వీటిని తీసుకురానున్నట్లు వెల్లడించింది. దేశంలో ఏఐ యాంకర్లు ఉన్న తొలి ప్రభుత్వ టీవీ ఛానల్‌గా ఇది నిలవనుంది. 

‘‘ఈ యాంకర్లు ఏఐ అనుసంధాన కంప్యూటర్లు. మనుషుల్లాగే పని చేస్తాయి. 365 రోజులు 24 గంటలు నిరంతరాయంగా వార్తలు చదువుతాయి. అన్ని రాష్ట్రాల రైతులు వీటిని వీక్షించొచ్చు. దేశవ్యాప్తంగా వ్యవసాయ రంగంలో జరుగుతున్న పరిశోధనల దగ్గర నుంచి మార్కెట్లలో ధరలు, వాతావరణ అంశాలు, ప్రభుత్వ పథకాలు సహా ప్రతీ సమాచారాన్ని అందజేస్తాయి. ఇవి ఏకంగా 50 భాషల్లో మాట్లాడగలవు’’ అని డీడీ కిసాన్‌ ఓ ప్రకటనలో వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు