Neelam: పార్లమెంటులో అలజడి ఘటన.. నిందితురాలికి బెయిల్‌ నిరాకరణ

పార్లమెంటులో భద్రతా వైఫల్యం కేసులో నిందితురాలు నీలమ్‌ ఆజాద్‌ బెయిల్‌ పిటిషన్‌ను దిల్లీ కోర్టు కొట్టేసింది.

Published : 18 Jan 2024 19:06 IST

దిల్లీ: పార్లమెంటులో భద్రతా వైఫల్యం కేసు (Parliament security breach case)లో నిందితురాలిగా ఉన్న నీలమ్‌కు బెయిల్‌ ఇచ్చేందుకు దిల్లీ కోర్టు నిరాకరించింది. ఈ దశలో ఉపశమనం కల్పించడం సరికాదంటూ ఆమె పిటిషన్‌ను అదనపు సెషన్స్ జడ్జి హర్‌దీప్ కౌర్ కొట్టేశారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న నీలమ్‌, మనోరంజన్‌, సాగర్‌శర్మ, లలిత్‌ ఝా, అమోల్‌ శిందే, మహేశ్‌ కుమావత్‌ల పోలీసు రిమాండ్‌ ముగియడంతో ఇటీవల వారిని కోర్టులో హాజరుపర్చగా జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

అలజడి ఘటన.. పార్లమెంట్‌ భద్రతపై కేంద్రం కీలక నిర్ణయం..!

గతేడాది పార్లమెంట్ శీతాకాల సమావేశాల వేళ డిసెంబరు 13న లోక్‌సభలోకి దుండగులు ప్రవేశించిన ఘటన యావత్‌ దేశాన్ని షాక్‌కు గురిచేసిన విషయం తెలిసిందే. లోక్‌సభలో జీరో అవర్‌ జరుగుతుండగా.. సాగర్‌శర్మ, మనోరంజన్‌లు పబ్లిక్‌ గ్యాలరీ నుంచి సభలోకి దూకి గందరగోళం సృష్టించారు. రంగుల పొగను వెదజల్లారు. ఆ సమయంలో అమోల్‌ శిందే, నీలమ్‌లు పార్లమెంట్ భవనం వెలుపల ఆందోళన చేశారు. నలుగురిని అక్కడే అరెస్టు చేయగా.. లలిత్ ఝా, మహేశ్‌ కుమావత్‌లను తర్వాత అదుపులోకి తీసుకున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని