Arvind Kejriwal: కేజ్రీవాల్‌కు దక్కని బెయిల్‌.. జూన్ 19 వరకు జ్యుడిషియల్ కస్టడీ

దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)కు దిల్లీ కోర్టు మధ్యంతర బెయిల్‌ను తిరస్కరించింది. 

Updated : 05 Jun 2024 16:52 IST

దిల్లీ: మధ్యంతర బెయిల్ కోసం దిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Arvind Kejriwal) చేసిన అభ్యర్థనను దిల్లీ కోర్టు తిరస్కరించింది. బరువు తగ్గడం, కిడ్నీ సమస్యలకు సంబంధించి వైద్య పరీక్షలు చేయించుకునేందుకు మధ్యంతర బెయిల్ పొడిగించాలని కేజ్రీవాల్ అభ్యర్థన చేసుకున్న సంగతి తెలిసిందే. దానిపై ఇప్పటికే వాదనలు విన్న న్యాయస్థానం తీర్పు ఈరోజుకు వాయిదా వేసింది. ఆయన పిటిషన్‌ను తోసిపుచ్చుతూ తాజాగా ఆదేశాలు ఇచ్చింది. జూన్‌ 19 వరకు జ్యుడిషియల్ కస్టడీని పొడిగింది. జైలు అధికారులు ఆయన వైద్య అవసరాలు చూసుకోవాలని కోర్టు ఆదేశించింది.

మద్యం కుంభకోణం కేసులో మనీలాండరింగ్ ఆరోపణలపై మార్చి 21న కేజ్రీవాల్‌ (Arvind Kejriwal)ను ఈడీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన అరెస్టును సవాల్‌ చేస్తూ కేజ్రీవాల్‌ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దానిపై విచారణ ఆలస్యమవుతుండటంతో ఎన్నికల్లో ప్రచారం కోసం చేసిన అభ్యర్థనను అంగీకరిస్తూ.. కోర్టు షరతులతో కూడిన మధ్యంతర బెయిల్‌ ఇచ్చింది. కోర్టు ఆదేశాల మేరకు జూన్‌ 2న తిరిగి జైలు అధికారుల ముందు లొంగిపోయారు. ఆయన ప్రస్తుతం తిహాడ్‌ జైల్లో ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు