Eknath Shinde: డిప్యూటీ సీఎం పర్యటన ఆలస్యం.. విమానం నడపడానికి పైలట్ నిరాకరణ

ఇంటర్నెట్‌డెస్క్: మహారాష్ట్ర (Maharashtra) ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ శిందే (Eknath Shinde)కు చేదు అనుభవం ఎదురైంది. ఆయన ప్రయాణించాల్సిన విమానం దాదాపు గంటపాటు ఆలస్యమైంది. ఇందుకు కారణం పైలట్ విమానం నడిపేందుకు నిరాకరించడమే. సీఎం పర్యటన ఆలస్యం కావడం వల్లే పైలట్ విమానాన్ని నడిపేందుకు అంగీకరించలేదని తెలుస్తోంది.
అసలేం జరిగిందంటే.. ఏక్‌నాథ్ శిందే, మంత్రి గిరీశ్ మహాజన్, గులాబ్‌రావ్ పాటిల్‌లు జలగావ్‌లో ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అయితే, ఈ పర్యటనకు ఆయన దాదాపు రెండున్నర గంటలు ఆలస్యంగా వచ్చారు. అనంతరం తిరిగి ముంబయికి వెళ్లేందుకు అక్కడి విమానాశ్రయానికి చేరుకున్నారు. అయితే, తన పని గంటలు ముగిశాయని చెప్పి పైలట్ విమానం నడిపేందుకు నిరాకరించాడు. దీంతో మంత్రులు విమాన సంస్థ ప్రతినిధులతో మాట్లాడి దాదాపు 45 నిమిషాలు అతడిని ఒప్పించేందుకు ప్రయత్నించారు. ఆ తర్వాత పైలట్ అంగీకరించడంతో విమానం ముంబయికి బయలుదేరింది. పైలట్‌కు ఆరోగ్యం సరిగా లేనందువల్లే ఇలా జరిగిందని గిరీశ్ తర్వాత ఓ ప్రకటనలో పేర్కొన్నారు.
కిడ్నీ బాధితురాలికి లిఫ్ట్ ఇచ్చిన శిందే..
ఇదిలాఉండగా.. కిడ్నీ శస్త్రచికిత్స కోసం మంబయికి వెళ్తున్న ఓ మహిళకు శిందే లిఫ్ట్ ఇచ్చారు. శీతల్ పాటిల్ అనే మహిళ తన భర్తతో కలిసి ముంబయికి ప్రయాణించాల్సి ఉంది. అయితే, వారు ఎక్కాల్సిన విమానం అప్పటికే వెళ్లిపోయింది. ఈ క్రమంలోనే శిందేకు వారి గురించి తెలిసి వారికి లిఫ్ట్ ఇచ్చారు. అంతేకాక వారి కోసం ముంబయి విమానాశ్రయంలో ఆంబులెన్స్‌ను సిద్ధంగా ఉండేలా చర్యలు తీసుకున్నారు. ఈసందర్భంగా వారు శిందేకు కృతజ్ఞతలు తెలిపారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


