Air India: ఎయిర్‌ ఇండియాకు రూ.10 లక్షల జరిమానా.. వారం వ్యవధిలోనే రెండోసారి!

ఎయిర్‌ ఇండియాకు వారం వ్యవధిలోనే మరో జరిమానా పడింది. గత ఏడాది పారిస్- దిల్లీ విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలను రిపోర్ట్‌ చేయనందుకుగానూ డీజీసీఏ రూ.10 లక్షల జరిమానా విధించింది.

Published : 24 Jan 2023 19:10 IST

దిల్లీ: ఎయిర్‌ ఇండియా(Air India)కు తాజాగా మరో జరిమానా పడింది. గత ఏడాది పారిస్- దిల్లీ విమానంలో ప్రయాణికుల అనుచిత ప్రవర్తన ఘటనలను రిపోర్ట్‌ చేయనందుకుగానూ డీజీసీఏ(DGCA) రూ.10 లక్షల జరిమానా విధించింది. డిసెంబరు 6న పారిస్‌- దిల్లీ విమానంలో ఓ ప్రయాణికురాలు వాష్‌రూమ్‌కు వెళ్లినప్పుడు.. మరో వ్యక్తి ఆమె సీట్‌పై ఉన్న దుప్పటిపై మూత్రవిసర్జన చేశాడు. అదే రోజు చోటుచేసుకున్న మరో ఘటనలో.. మద్యం మత్తులో మరుగుదొడ్ల గదిలో పొగతాగుతూ ఓ వ్యక్తి విమాన సిబ్బందికి పట్టుబడ్డాడు. తాము నివేదిక కోరేంత వరకు ఈ ఘటనలపై ఎయిర్‌ ఇండియా రిపోర్ట్‌ చేయకపోవడాన్ని డీజీసీఏ ఇదివరకే తప్పుబట్టింది.

ప్రయాణికుల వికృత చేష్టలకు సంబంధించిన నిబంధనలు పాటించడంలో విమాన సంస్థ ప్రతిస్పందన లోపభూయిష్ఠంగా, ఆలస్యంగా ఉందని పేర్కొంది. ఈ క్రమంలోనే ఇటీవల షోకాజ్‌ నోటీసు జారీ చేసింది. తాజాగా రూ.10 లక్షల జరిమానా విధించింది. ఈ అనుచిత ప్రవర్తన ఘటనలను అంతర్గత కమిటీ దృష్టికి తీసుకెళ్లడంలో విమానయాన సంస్థ ఆలస్యం చేసినట్లు తాజాగా చెప్పింది. ఇదిలా ఉండగా.. న్యూయార్క్‌- దిల్లీ విమానంలో ఓ మహిళపై ప్రయాణికుడు మూత్ర విసర్జన చేసిన ఘటనలోనూ ఎయిర్‌ ఇండియాకు డీజీసీఏ రూ.30 లక్షల జరిమానా విధించిన విషయం తెలిసిందే. ఇలా వారం వ్యవధిలోనే ఎయిర్‌ ఇండియాకు రెండుసార్లు జరిమానా పడటం గమనార్హం.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు