Holi Fesival: 2000 కేజీల ద్రాక్షపండ్లతో వినాయక ఆలయ అలంకరణ

పుణెలో ప్రసిద్ధ దగడూసేఠ్‌ వినాయక ఆలయాన్ని 2 వేల కిలోల ద్రాక్షపండ్లతో అలంకరించారు.

Updated : 24 Mar 2024 18:51 IST

పుణె: హోలీ సందర్భంగా మహారాష్ట్రలోని పుణెలో ప్రసిద్ధ దగడూసేఠ్‌ వినాయక ఆలయాన్ని 2 వేల కిలోల ద్రాక్షపండ్లతో అలంకరించారు. ఆలయ ప్రాంగణాన్ని నలుపు, ఆకుపచ్చని ద్రాక్షలతో ఆదివారం సుందరంగా తీర్చిదిద్దారు. సంకటహర చతుర్థి రోజున ద్రాక్ష మహోత్సవ్ (Grapes Festival)ను వేడుకగా చేసుకుంటారు. సహ్యాద్రి ఫామ్స్ ఆధ్వర్యంలో ఆలయాన్ని ద్రాక్షలతో అలంకరించగా.. ఈ అద్భుత దృశ్యాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో భక్తజనం తరలివచ్చారు. స్వామివారి వద్ద ఉంచిన ద్రాక్ష పండ్లను ససూన్‌ ఆస్పత్రి, పితాశ్రీ వృద్ధాశ్రమంతో పాటు పలు సంస్థలకు, గణపయ్యను దర్శించుకొనేందుకు వచ్చిన భక్తులకు పంపిణీ చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు