Encounter: యూపీలో మరో ఎన్‌కౌంటర్‌.. గ్యాంగ్‌స్టర్‌ అనిల్‌ దుజానా హతం!

ఉత్తర్‌ప్రదేశ్‌లో మరో ఎన్‌కౌంటర్‌ జరిగింది. కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ అనిల్‌ దుజానా.. పోలీసులు జరిపిన కాల్పుల్లో హతమయ్యాడు.

Updated : 04 May 2023 17:01 IST

లఖ్‌నవూ: ఉత్తర్‌ప్రదేశ్‌ (Uttar Pradesh)లో మరో ఎన్‌కౌంటర్‌ (Encounter) చోటుచేసుకుంది. కరడుగట్టిన గ్యాంగ్‌స్టర్‌ అనిల్‌ దుజానా (Anil Dujana)ను యూపీ ఎస్‌టీఎఫ్‌ పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేశారు. ఇక్కడి మేరఠ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది.

పశ్చిమ యూపీకి చెందిన అనిల్ దుజానాపై 18 హత్యలతోపాటు దోపిడీలు, భూకబ్జాలు తదితర నేరాలకు సంబంధించి 62 వరకు కేసులున్నాయి. అతడిపై బులంద్‌శహర్ పోలీసులు రూ.25 వేలు, నోయిడా పోలీసులు రూ.50 వేల రివార్డు ప్రకటించారు. ఓ హత్య కేసులో ఇటీవలే జైలు నుంచి బెయిల్‌పై విడుదలైన అతడు.. తనపై కేసుల్లోని సాక్షులను బెదిరించినట్లు సమాచారం. దీంతో అతడిని అరెస్టు చేసేందుకు పోలీసులు యత్నించగా.. ఈ క్రమంలోనే ఎన్‌కౌంటర్‌ చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా.. ఉమేశ్‌పాల్‌ హత్య కేసులో ఇటీవలే గ్యాంగ్‌స్టర్, మాజీ ఎంపీ అతీక్ అహ్మద్ కుమారుడు అసద్, మరో నిందితుడు గుల్హామ్‌లు పోలీసులు జరిపిన ఎదురుకాల్పుల్లో హతమైన విషయం తెలిసిందే. తదనంతరం అతీక్‌ అహ్మద్‌, అతడి సోదరుడు అష్రఫ్‌లను ముగ్గురు వ్యక్తులు కాల్చి చంపారు. ఇది జరిగిన కొన్ని రోజులకే తాజాగా అనిల్‌ దుజానా ఎన్‌కౌంటర్‌ జరిగింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని