Modi: 45 గంటల సుదీర్ఘ ధ్యానంలో మోదీ.. ద్రవమే ఆహారం!

సార్వత్రిక ఎన్నికల వేళ విస్తృత ప్రచారం నిర్వహించిన మోదీ(Modi).. ప్రస్తుతం ధ్యానంతో సేదతీరుతున్నారు. కన్యాకుమారిలోని వివేకానందుడి శిలాస్మారకం వద్ద సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు. 

Updated : 31 May 2024 17:29 IST

చెన్నై: తమిళనాడులోని కన్యాకుమారిలో స్వామి వివేకానంద శిలాస్మారకం వద్ద ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Modi) గురువారం సాయంత్రం నుంచి సుదీర్ఘ ధ్యానంలో కూర్చున్నారు. 45 గంటలపాటు ఈ మెడిటేషన్ చేయనున్నారు. జాతీయ మీడియా కథనాల ప్రకారం..

గురువారం సాయంత్రం 6.45 గంటల సమయంలో మోదీ ధ్యానం ప్రారంభించారు. ఈ సమయంలో ఆయన కేవలం ద్రవాహారాన్ని మాత్రమే స్వీకరిస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. కొబ్బరి నీళ్లు, ద్రాక్షరసం అందులో భాగంగా ఉంటాయని పేర్కొన్నాయి. ఈ సమయంలో ఆయన మౌనంగా ఉంటారని, మెడిటేషన్ హాల్‌ నుంచి బయటకు రారని తెలిపాయి. ఈ క్రమంలో ఆయన కాషాయ దుస్తులు ధరించి, ధ్యానంలో కూర్చొని ఉన్న కొన్ని దృశ్యాలు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఆ ఫొటోలు నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.

సార్వత్రిక ఎన్నికల ప్రచార గడువు ముగిసిన వెంటనే పంజాబ్‌ నుంచి వెనుదిరిగిన మోదీ.. తమిళనాడులోని భగవతి అమ్మన్ ఆలయంలో పూజలు నిర్వహించారు. అనంతరం ఓ పడవలో బయలుదేరి సముద్రం మధ్యలో ఉన్న  శిలాస్మారకాన్ని చేరుకొని రామకృష్ణ పరమహంస, మాతా శారదాదేవి చిత్రపటాలకు పూలమాలలు వేశారు. వివేకానందుడి విగ్రహం వద్ద పుష్పాంజలి ఘటించాక ధ్యాన ప్రక్రియను ప్రారంభించారు. 131 ఏళ్ల క్రితం స్వామి వివేకానంద కూడా ఇక్కడ ధ్యానం చేశారు. ఇదిలా ఉంటే.. 2019లో ఎన్నికలు ముగిసిన తర్వాత ఆయన కేదార్‌నాథ్‌ వద్ద గుహల్లో ధ్యానం చేసిన విషయం తెలిసిందే.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని