ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం తప్పనిసరా?.. ఈసీ క్లారిటీ

ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానం స్వచ్ఛందమేనని ఈసీ స్పష్టం చేసింది.

Published : 02 Apr 2024 22:53 IST

దిల్లీ: ఓటరు కార్డుకు ఆధార్‌ అనుసంధానంపై పలువురు వ్యక్తం చేస్తున్న సందేహాలపై ఈసీ క్లారిటీ ఇచ్చింది. ఆధార్‌ అనుసంధానం తప్పనిసరి కాదని.. ఇది ఓటరు స్వచ్ఛందమని తేల్చి చెప్పింది. ‘‘ఈసీ ఓటర్లకు ఆధార్‌ను తప్పనిసరి చేసినట్లుంది. ఓటరు జాబితాలో చేర్చేందుకు ఆధార్‌ను లింక్‌ చేయాలంటూ బీఎల్‌వోలు బలవంత పెడుతున్నారు. ఆధార్‌లేని వారు ఓటు వేయలేరు’’ అంటూ ఓ నెటిజన్‌ చేసిన ట్వీట్‌పై ఈసీ స్పందించింది. ఓటర్లే స్వయంగా ఆధార్‌ వివరాలు నమోదుకు ఉద్దేశించిన ఫారం 6-బీ స్వచ్ఛందమని పేర్కొంది. ఆధార్‌ సమర్పించలేదన్న కారణంగా ఓటర్ల జాబితాలో నమోదును తొలగించడం జరగదని పేర్కొంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని