LS Elections: పశ్చిమ బెంగాల్‌లో పోలింగ్‌ వాహనాలకు జీపీఎస్‌

LS Elections: పోలింగ్‌ సందర్భంగా ఉపయోగించే అన్ని వాహనాలకు పశ్చిమ బెంగాల్‌లో జీపీఎస్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు ఎన్నికల సంఘం అధికారులు తెలిపారు.

Updated : 09 Apr 2024 12:30 IST

కోల్‌కతా: పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికల సమయంలో (Lok sabha elections) అవాంఛనీయ సంఘటనలను అరికట్టడంలో భాగంగా కేంద్ర ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. పోలింగ్‌ కోసం వాడే అన్ని వాహనాలకు జీపీఎస్‌ లొకేషన్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను (GPS location tracking system) ఏర్పాటు చేయనున్నట్లు ఓ అధికారి సోమవారం వెల్లడించారు. ఈ మేరకు సిబ్బందికి అవసరమైన సూచనలు చేసినట్లు తెలిపారు.

‘‘ఈవీఎం సహా ఇతర సామగ్రిని పోలింగ్‌ కేంద్రాలకు తరలించే సమయంలో.. ఎన్నికలు ముగిసిన తర్వాత వాటిని స్ట్రాంగ్‌రూమ్‌లకు తీసుకొచ్చే వరకు పర్యవేక్షించేందుకు జీపీఎస్‌ ట్రాకింగ్‌ వ్యవస్థను ఉపయోగించనున్నాం. తద్వారా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూస్తాం’’ అని ఎన్నికల సంఘం అధికారి వెల్లడించారు. ఒకవేళ ఏమైనా అవకతవకలు గుర్తిస్తే వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. డ్రైవర్లు సహా పోలింగ్‌ బాధ్యతలు నిర్వర్తిస్తున్న అధికారులను ప్రశ్నిస్తామని తెలిపారు. పశ్చిమ బెంగాల్‌లో లోక్‌సభ ఎన్నికలు ఏప్రిల్ 19 నుంచి జూన్ 1 వరకు మొత్తం 7 దశల్లో జరగనున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని