Pinaray Vijayan: కేరళ సీఎం కుమార్తెపై మనీలాండరింగ్‌ కేసు

కేరళ సీఎం పినరయి విజయన్‌ కుమార్తెపై ఈడీ పీఎంఎల్‌ఏ చట్టం కింద కేసు నమోదు చేసింది. దీని విచారణకు సంబంధించి త్వరలో సమన్లు జారీ చేయనుంది.

Published : 27 Mar 2024 16:31 IST

కొచ్చి: కేరళ (Kerala) సీఎం పినరయి విజయన్‌ (Pinarayi Vijayan) కుమార్తె వీణా విజయన్‌ (Veena Vijayan)తోపాటు మరికొందరిపైనా ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్ (ED) అక్రమ నగదు చలామణి చట్టం (PMLA) కింద కేసు నమోదు చేసింది. ఆమెకు చెందిన ఐటీ సంస్థకు ఓ ప్రైవేటు కంపెనీ అక్రమంగా చెల్లింపులు చేసిందనే ఆరోపణలతో కేసు నమోదు చేసినట్లు ఈడీ అధికారులు తెలిపారు. దీని విచారణకు సంబంధించి వీణాతో పాటు మరికొందరికి త్వరలో సమన్లు జారీ చేయనుంది. 

కొద్ది రోజుల క్రితం కేంద్ర కార్పొరేట్‌ వ్యవహారాల మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలోని సీరియస్‌ ఫ్రాడ్‌ ఇన్వెస్టిగేషన్‌ కార్యాలయం (SFIO) దాఖలు చేసిన ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని వీణాతోపాటు ఆమె సంస్థ, మరికొందరిపై ఈడీ పీఎంఎల్‌ఏ కేసు నమోదు చేసింది. కొచ్చిన్‌ మినరల్స్‌ అండ్ రూటైల్‌ లిమిటెడ్‌ (CMRL) అనే సంస్థ వీణాకు చెందిన ఎక్సాలాజిక్‌ సొల్యూషన్స్ (Exalogic Solutions) కంపెనీకి 2018-19 మధ్య అక్రమంగా రూ.1.72 కోట్లు చెల్లింపులు చేసినట్టు ఆదాయపన్ను శాఖ గుర్తించింది. కొచ్చిన్‌ మినరల్స్‌కు ఎక్సాలాజిక్‌ ఎలాంటి సర్వీస్‌ను అందించకుండానే ఈ చెల్లింపులు జరిగినట్లు ఐటీ శాఖ పేర్కొంది. దీంతో ఎక్సాలాజిక్‌పై ఎస్‌ఎఫ్‌ఐఓ విచారణ జరిపి అక్రమంగా చెల్లింపులు జరిగినట్లు వెల్లడించింది. మరోవైపు ఎస్‌ఎఫ్‌ఐఓ విచారణకు వ్యతిరేకంగా ఎక్సాలాజిక్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను కర్ణాటక హైకోర్టు ఇప్పటికే కొట్టివేసింది.  

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని