Lalu: లాలూ, తేజస్వీ యాదవ్‌లకు మరోసారి ఈడీ సమన్లు

ఆర్జేడీ చీఫ్‌ లాలూ ప్రసాద్‌యాదవ్‌, ఆయన తనయుడు తేజస్వీ యాదవ్‌కు ఈడీ అధికారులు మరోసారి సమన్లు జారీ చేశారు.

Published : 19 Jan 2024 19:40 IST

పట్నా: బిహార్‌ డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్‌, ఆయన తండ్రి ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌లకు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ED) అధికారులు మరోసారి సమన్లు జారీచేశారు.  భూములు తీసుకుని.. బదులుగా రైల్వే ఉద్యోగాలు కట్టబెట్టారన్న ఆరోపణలతో నమోదైన మనీ లాండరింగ్‌ కేసులో తండ్రీ కొడుకులను విచారించనున్నారు. ఇందుకోసం పాట్నాలోని ఈడీ కార్యాలయానికి రావాలని సమన్లలో పేర్కొన్నారు. జనవరి 29న లాలూ ప్రసాద్‌యాదవ్‌, ఆ మరుసటి రోజు (జనవరి 30న) తేజస్వీ యాదవ్‌ తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఈడీ సూచించినట్లు అధికారిక వర్గాలు పేర్కొన్నాయి. ఈ సమన్లను లాలూ సతీమణి, మాజీ సీఎం రబ్రీ దేవి నివాసంలో ఈడీ అధికారుల బృందం అందజేసింది.  ఇదే కేసులో వీరిద్దరి వాంగ్మూలాలు నమోదు చేసేందుకు గత నెల డిసెంబర్‌లో సమన్లు జారీ చేసినా ఇద్దరూ విచారణకు హాజరు కాలేదు. యూపీఏ-1 ప్రభుత్వంలో లాలూ కేంద్ర రైల్వేమంత్రిగా ఉన్న సమయంలో జరిగిన ఈ కుంభకోణానికి సంబంధించి తాజాగా మరోసారి ఈడీ సమన్లు జారీ చేసింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని