ఎలక్టోరల్‌ బాండ్ల వివరాలు.. ఎస్‌బీఐ ఇచ్చిన కొత్త డేటా అందుబాటులోకి!

ఎన్నికల బాండ్లకు సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తాజాగా ఇచ్చిన సమాచారాన్ని ఎన్నికల సంఘం (Election Commission) తన వెబ్‌సైట్‌లో ఉంచింది.

Updated : 21 Mar 2024 20:17 IST

దిల్లీ: రాజకీయ పార్టీలకు అందిన విరాళాలకు సంబంధించి స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (SBI) తాజాగా ఇచ్చిన సమాచారాన్ని ఎన్నికల సంఘం (Election Commission) తన వెబ్‌సైట్‌లో ఉంచింది. రాజకీయ పార్టీలకు ఏయే సంస్థలు ఎంతెంత విరాళం ఇచ్చాయి? బాండ్ల సీరియల్‌ నంబర్లు ఇందులో ఉన్నాయి. దాతల విక్రయ వివరాలు, రెడీమ్‌ చేసుకున్న పార్టీల వివరాలను వేర్వేరు డాక్యుమెంట్లలో పొందుపరిచింది.

ఇదే విషయాన్ని ఎస్‌బీఐ కూడా గురువారం ఉదయం ప్రకటించింది. సుప్రీంకోర్టు (Supreme Court) ఆదేశాలకు అనుగుణంగా ఎన్నికల బాండ్ల వివరాలను ఈసీకి అందజేశామని తెలిపింది. భద్రతా కారణాల దృష్ట్యా బ్యాంకు ఖాతాల నంబర్లు, కేవైసీ వివరాలను బహిర్గతం చేయలేదని పేర్కొంది. ఇందుకు సంబంధించి సుప్రీం కోర్టులో ఎస్‌బీఐ అఫిడవిట్‌ కూడా దాఖలు చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని