Rahul Gandhi: రాహుల్‌ గాంధీ హెలికాప్టర్‌లో ఎన్నికల అధికారుల తనిఖీలు

Rahul Gandhi: తమిళనాడులోని నీలగిరిలో కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీ హెలికాప్టర్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ చేశారు.

Updated : 15 Apr 2024 12:47 IST

నీలగిరి: లోక్‌సభ ఎన్నికలు (Lok sabha Elections) సమీపిస్తున్న వేళ అధికారులు తనిఖీల ముమ్మరం చేశారు. ముఖ్యంగా రాష్ట్రాల సరిహద్దుల్లో ప్రతి వాహనాన్ని జల్లెడ పడుతున్నారు. తాజాగా కాంగ్రెస్‌ (Congress) అగ్రనేత రాహుల్‌ గాంధీ (Rahul Gandhi) హెలికాప్టర్‌ను వారు తనిఖీ చేశారు. 

తమిళనాడులోని నీలగిరి పార్లమెంటరీ స్థానం నుంచి పోటీ చేస్తున్న డీఎంకే అభ్యర్థి ఎ. రాజాకు మద్దతుగా రాహుల్‌ గాంధీ సోమవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. నేటి ఉదయం ఆయన హెలికాప్టర్‌ (Helicopter) నీలగిరిలో ల్యాండ్ అయింది. ఎన్నికల ఫ్లయిండ్‌ స్క్వాడ్‌ అధికారులు దానిని తనిఖీ చేశారు. దాదాపు 10 నిమిషాల పాటు ఈ సోదాలు జరిగాయి. ఇందులో ఎలాంటి నగదు, వస్తువులు లభించలేదని అధికారులు తెలిపారు.

ఈ ప్రచారం ముగించుకుని రాహుల్‌ కేరళలోని వయనాడ్‌ వెళ్లారు. ఈ నియోజకవర్గానికి ఏప్రిల్‌ 26న పోలింగ్‌ జరగనుంది. ఇక్కడి నుంచి వరుసగా రెండోసారి పోటీలో ఉన్న ఆయన.. నేడు ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని