viral post: ఐపీఎల్‌ పాయింట్లు పంచి పెడతాం అన్నట్లు ఉంది.. మాజీ క్రికెటర్‌ సెటైర్

తాము అధికారంలోకి వస్తే సంపద పునర్విభజనపై సర్వే చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్‌ వేదికగా స్పందించారు. 

Published : 23 Apr 2024 00:08 IST

దిల్లీ: తాము అధికారంలోకి వస్తే సంపద పునర్విభజనపై సర్వే చేస్తామని కాంగ్రెస్ ఇచ్చిన హామీపై మాజీ క్రికెటర్ వెంకటేశ్ ప్రసాద్ ఎక్స్‌ వేదికగా స్పందించారు. ఓ రాజకీయ పార్టీ మేనిఫెస్టోలో ధనికుల సంపదను పేదలకు పంపిణీ చేస్తామని చెబుతోంది. పేదలు అభివృద్ధి చెందాలి కాని, ఈవిధంగా కాదు అని ఆయన పేర్కొన్నారు. ఇది ఐపీఎల్‌ పాయింట్ల పట్టికలో మొదటి నాలుగు జట్ల నుంచి పాయింట్లు తీసుకొని వాటిని దిగువ జట్లకు పంపిణీ చేసినట్టుగా ఉంటుందని వ్యాఖ్యానించారు. దీంతో వారు ప్లేఆఫ్స్‌కు చేరుకునే అవకాశం ఉంటుందన్నారు.

‘‘వీరి తీరు మనం రాజస్థాన్‌ రాయల్స్‌, కోల్‌కతా నైట్‌ రైడర్స్‌, సన్‌ రైజర్స్‌ హైదరాబాద్‌ నుంచి చెరో నాలుగు పాయింట్లు తీసుకుంటే సీజన్‌లో దిగువన ఉన్న మూడు జట్లు దిల్లీ క్యాపిటల్స్, పంజాబ్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు పంపిణీ చేయవచ్చు అన్నట్లుగా ఉంది’’ అని వెంకటేశ్‌ వ్యాఖ్యానించారు.

ఇటీవల రాహుల్‌గాంధీ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వస్తే దేశంలోని ధనికుల సంపదను పేద ప్రజలకు పంపిణీ చేస్తామని, దానికోసం ఆర్థిక, సంస్థాగత సర్వే నిర్వహిస్తామని చెప్పిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం ఐపీఎల్‌ 2024లో రాజస్థాన్ రాయల్స్, కోల్‌కతా నైట్ రైడర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్ కింగ్స్ పాయింట్ల పట్టికలో వరుసగా మొదటి నాలుగు స్థానాల్లో ఉన్నాయి. మొదటి నాలుగు స్థానాల్లో నిలిచిన జట్లు ప్లేఆఫ్స్‌కు అర్హత సాధిస్తాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని