Nashik: నాసిక్‌లో ఏఐఎంఐఎం నేతపై కాల్పులు..!

మాలేగావ్‌ మాజీ మేయర్‌పై సోమవారం తెల్లవారు జామున దాడి జరిగింది. దీంతో నగరంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. 

Updated : 27 May 2024 12:59 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: మాలేగావ్‌ మాజీ మేయర్‌, ఏఐఎంఐఎం నేత అబ్దుల్‌ మాలిక్‌ మహమ్మద్‌ యూనిస్‌పై నేటి తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆయనకు మూడు తూటాలు తాకాయి. వెంటనే స్థానిక ఆస్పత్రిలో చేర్పించి చికిత్సను అందించారు. ఛాతి ఎడమ భాగం, కుడి తొడ, కుడి చేయికి గాయాలయ్యాయి. పరిస్థితి తీవ్రంగా ఉండటంతో ఆయన్ను నాసిక్‌లో మరో వైద్యశాలకు తీసుకెళ్లారు. 

మహారాష్ట్ర ఎంఐఎం శాఖలో అబ్దుల్‌ ప్రముఖ నాయకుడు. సోమవారం తెల్లవారు జామున 1.20 సమయంలో ఓల్డ్‌ ఆగ్ర రోడ్డులోని ఒక రెస్టారంట్‌ ఎదుట కూర్చొని ఉండగా ఈ దాడి జరిగినట్లు నాసిక్‌ పోలీసులు వెల్లడించారు. నిందితుల కోసం ఇప్పటికే గాలింపు చర్యలు చేపట్టారు. నగరంలో వేసవి తీవ్రతకు స్థానికులు అర్ధరాత్రి కూడా మెలకువగానే ఉండటం ఇక్కడ పరిపాటి. 

అబ్దుల్‌ మాలిక్‌పై దాడి వార్త తెలియగానే పెద్ద సంఖ్యలో స్థానికులు అక్కడికి వచ్చారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు అక్కడకు చేరుకొని సంయమనం పాటించాలని కోరారు. భారీ ఎత్తున భద్రతా దళాలను మోహరించారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు