Bengaluru Metro: రైతును మెట్రో ఎక్కనివ్వని సిబ్బంది... మురికి దుస్తులే కారణమట...

వేసుకున్న దుస్తులు మురుగ్గా ఉన్నాయనే కారణంతో ఓ రైతును మెట్రో సిబ్బంది  ట్రైన్‌ ఎక్కకుండా అడ్డుకున్న ఘటన ఆదివారం బెంగళూరులో చోటుచేసుకుంది. 

Updated : 27 Feb 2024 04:38 IST

బెంగళూరు: దుస్తులు మురికిపట్టి ఉన్నాయనే కారణంతో ఓ రైతును మెట్రో సిబ్బంది ట్రైన్‌ ఎక్కకుండా అడ్డుకున్న ఘటన ఆదివారం బెంగళూరులో చోటుచేసుకుంది. స్థానికుల వివరాల మేరకు... బెంగళూరులోని రాజాజీనగర్ మెట్రోస్టేషన్‌లో ట్రైన్‌ ఎక్కడానికి వచ్చిన ఓ రైతు దుస్తులు శుభ్రంగా లేవని అతన్ని ట్రైన్‌ ఎక్కకుండా సెక్యూరిటీ సూపర్‌వైజర్ అడ్డుకున్నారు. ఇది గమనించిన ఓ యువకుడు ఆ వ్యక్తికి మద్దతుగా అధికారులను ప్రశ్నించాడు. 

దుమ్ము పట్టిన దుస్తులు వేసుకున్న వృద్ధుడిని ప్రయాణానికి అనుమతిస్తే, ఇతర ప్రయాణికులు అభ్యంతరం చెబుతారనే అనుమతించలేదని సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ తెలిపారు. బెంగళూరు మెట్రో కేవలం వీఐపీల కోసమా లేక ప్రజల కోసమా అని ఓ యువకుడు సూపర్‌వైజర్‌ని ప్రశ్నించారు. దుస్తుల ఆధారంగా ప్రయాణించేందుకు అనుమతి ఇవ్వమని లిఖితపూర్వకంగా రాసి ఇవ్వాలని ఆ యువకుడు సూపర్‌వైజర్‌ను కోరగా, అతడు సమాధానమివ్వలేదు.  అనంతరం వృద్ధ రైతును మెట్రోలో ప్రయాణించేందుకు అనుమతించారు. ఈవిషయంపై స్పందించిన బెంగళూరు మెట్రో రైల్‌ కార్పొరేషన్‌ (BMRCL) సెక్యూరిటీ సూపర్‌వైజర్‌ను సస్పెండ్ చేసింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాలలో వైరల్‌ అవడంతో నెటిజన్లు ఆ యువకుడిని ప్రశంసిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని