Bullet Train: ‘ఇదీ భారత భవిష్యత్తు!’.. బుల్లెట్‌ రైలు విశేషాల వీడియో

‘ముంబయి- అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు కారిడార్‌’ విశేషాలతో కూడిన ఓ వీడియోను రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేశారు.

Published : 13 Feb 2024 02:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గంటకు గరిష్ఠంగా 320 కి.మీల మెరుపు వేగం.. రెండు గంటల్లో 508 కిమీ ప్రయాణం.. నదులపై 24 వంతెనలు.. ‘ముంబయి- అహ్మదాబాద్‌ బుల్లెట్‌ రైలు కారిడార్‌ (Mumbai- Ahmedabad Buller Train Corridor)’ విశేషాలతో కూడిన వీడియోను రైల్వేశాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ (Ashwini Vaishnaw) ‘ఎక్స్‌’ వేదికగా పోస్ట్‌ చేశారు. తమ ప్రభుత్వం కలలు కాదు.. వాస్తవాలను సృష్టిస్తోందని పేర్కొంటూ.. ప్రధాని మోదీ మూడో పాలనలో ‘బుల్లెట్‌ రైలు’ కోసం ఎదురుచూడండంటూ రాసుకొచ్చారు.

తొలి బుల్లెట్‌ రైలు.. ఆగస్టు 2026 నాటికి 50కి.మీ సిద్ధం!

ఈ ప్రాజెక్టును ప్రపంచస్థాయి ఇంజినీరింగ్‌ అద్భుతంగా అభివర్ణిస్తూ.. దీన్ని భారత భవిష్యత్తుగా వీడియోలో పేర్కొన్నారు. దేశంలోనే తొలిసారి స్లాబ్‌ ట్రాక్‌ వ్యవస్థ, భూకంపాలను ముందుగానే గుర్తించే ఏర్పాట్లు, 28 స్టీలు వంతెనలు, ఏడు సొరంగాలు, సముద్రగర్భంలో ఏడు కిలోమీటర్ల పొడవైన టన్నెల్‌, అత్యాధునిక సౌకర్యాలతో కూడిన 12 రైల్వేస్టేషన్లు తదితర విశేషాలను ప్రస్తావించారు. ప్రాజెక్టు వ్యయం దాదాపు 1.08 లక్షల కోట్లు. తొలి ప్రయోగాత్మక పరుగును 2026లో చేపట్టేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని