LS polls: ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు.. తమిళనాడు మంత్రిపై కేసు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ తమిళనాడు మంత్రిపై కేసు నమోదైంది.

Published : 25 Mar 2024 14:36 IST

చెన్నై: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi)పై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఓ తమిళనాడు మంత్రిపై కేసు నమోదైంది. ఎన్నికల కోడ్‌ను (Lok Sabha Elections) ఉల్లంఘించారంటూ స్థానిక భాజపా నేతలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు రాష్ట్ర మత్య్స, పశుసంవర్ధక శాఖ మంత్రి అనితా ఆర్‌. రాధాకృష్ణన్‌పై పోలీసులు ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారు. ఏప్రిల్‌ 19న అక్కడ 39 లోక్‌సభ స్థానాలకు పోలింగ్‌ జరగనుంది.

మార్చి 22న తండుపాతులో జరిగిన డీఎంకే కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న మంత్రి రాధాకృష్ణన్‌.. ప్రధాని మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేశారు. దివంగత ముఖ్యమంత్రి కామరాజ్‌ను ప్రధాని మోదీ ప్రశంసించడంపైనా ఆయన విరుచుకుపడ్డారు. ఈ క్రమంలో అసభ్య పదజాలాన్ని ఉపయోగించారు. ఇదే విషయాన్ని రాష్ట్ర భాజపా నేతలు ఎన్నికల సంఘం దృష్టికి తీసుకువెళ్లారు. మంత్రి రాధాకృష్ణన్‌ ఎన్నికల నియమావళి ఉల్లంఘించారని, ఆయనపై చర్యలు తీసుకోవాలని ఈసీతోపాటు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పరిశీలించిన పోలీసులు సదరు మంత్రిపై కేసు నమోదు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని