BJP: భాజపాలో చేరిన మాజీ వాయుసేనాధిపతి భదౌరియా

భారత మాజీ వాయుసేనాధిపతి ఆర్‌.కె.సింగ్‌ భదౌరియా భాజపాలో చేరారు. సెప్టెంబర్‌ 2021లో పదవీ విరమణ చేసిన ఆయన.. ఈ లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

Updated : 24 Mar 2024 15:08 IST

దిల్లీ: భారత మాజీ వాయుసేనాధిపతి ఆర్‌.కె.సింగ్‌ భదౌరియా భాజపాలో చేరారు. ఆ పార్టీ జనరల్‌ సెక్రటరీ వినోద్‌ థావడే, కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకుర్‌ సమక్షంలో కాషాయ కండువా కప్పుకొన్నారు. ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌గా సేవలందించిన భదౌరియా సెప్టెంబర్‌ 2021లో పదవీ విరమణ చేశారు. లోక్‌సభ ఎన్నికల ముందు భాజపాలో చేరడంతో సొంత రాష్ట్రం నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రాకు చెందిన రాకేశ్‌ కుమార్‌ సింగ్‌ భదౌరియా.. 1980లో భారత వాయుసేనలో చేరారు. కీలక బాధ్యతల్లో కొనసాగారు. ఎయిర్‌ఫోర్స్‌ చీఫ్‌గా ఉన్న సమయంలోనే ఫ్రాన్స్‌ నుంచి రఫేల్‌ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి రూ.56వేల కోట్ల విలువైన ఒప్పందంపై చర్చలు జరిగాయి. భారత వాయుసేనలో దాదాపు 40 ఏళ్లు సేవలందించిన ఆయన ఆత్మనిర్భర భారత్‌కు ఎంతో సహకరించారు.

ఆర్మీ మాజీ చీఫ్‌ జనరల్‌ వీకే సింగ్‌ కూడా 2014 లోక్‌సభ ఎన్నికల ముందు భాజపాలో చేరిన సంగతి తెలిసిందే. దేశంలో జాతీయవాదమున్న ఏకైక పార్టీ భాజపానే అని అప్పట్లో చెప్పిన ఆయన.. మోదీ కేబినెట్‌లో మంత్రిగా కొనసాగుతున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని