IAF Aircraft: ఇంధన ట్యాంకును జారవిడిచిన యుద్ధవిమానం

భారత వైమానిక దళానికి చెందిన ఒక యుద్ధవిమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో బాహ్య ఇంధన ట్యాంకును పైలట్‌.. నేలపైకి జారవిడిచేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు.

Updated : 25 Jul 2023 09:55 IST

సంత్‌ కబీర్‌నగర్‌: భారత వైమానిక దళానికి చెందిన ఒక యుద్ధవిమానంలో సాంకేతిక సమస్య తలెత్తడంతో బాహ్య ఇంధన ట్యాంకును పైలట్‌.. నేలపైకి జారవిడిచేయాల్సి వచ్చిందని అధికారులు తెలిపారు. అది ఉత్తర్‌ప్రదేశ్‌లోని సంత్‌ కబీర్‌నగర్‌ జిల్లాలో ఉన్న బంజారియా బలుశాషన్‌ అనే గ్రామంలో పడింది. దీనివల్ల నేలమీద ఎవరికీ గాయాలు కాలేదని, ఆస్తి నష్టం కూడా జరగలేదని పేర్కొన్నారు. ఇంధన ట్యాంకు పడిన సమాచారాన్ని జిల్లా ఎస్పీ.. వాయుసేనకు తెలియజేశారు. సాధారణ శిక్షణలో భాగంగా ఈ విమానం ఉత్తర్‌ ప్రదేశ్‌లోని గోరఖ్‌పుర్‌ నుంచి నింగిలోకి పయనమైంది. అది వైమానిక దళానికి చెందిన జాగ్వార్‌ యుద్ధవిమానమని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని