Gautam Gambhir: ‘రాజకీయ బాధ్యతల నుంచి తప్పించండి’: భాజపా అధ్యక్షుడికి గంభీర్‌ అభ్యర్థన

తాను రాజకీయాల నుంచి వైదొలగాలని అనుకుంటున్నట్లు భాజపా ఎంపీ గౌతమ్ గంభీర్(Gautam Gambhir) పోస్టు పెట్టారు. 

Updated : 02 Mar 2024 16:03 IST

దిల్లీ: భాజపా ఎంపీ, టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్‌(Gautam Gambhir) పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. తనను రాజకీయ విధుల నుంచి తప్పించాలని శనివారం భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాను అభ్యర్థించారు. దాంతో ఆయన క్రియాశీల రాజకీయాలకు దూరం కానున్నారని తెలుస్తోంది. 

‘‘క్రికెట్‌కు సంబంధించిన బాధ్యతల నిమిత్తం.. నన్ను రాజకీయ విధుల నుంచి తప్పించమని భాజపా అధ్యక్షుడు జేపీ నడ్డాను అభ్యర్థించాను. ప్రజలకు సేవ చేసుకునే అవకాశం కల్పించిన ప్రధాని మోదీకి కృతజ్ఞతలు. జై హింద్‌’’ అంటూ ఆయన సామాజిక మాధ్యమాల్లో పోస్టు పెట్టారు. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్‌గా మారింది. గంభీర్ 2019లో భాజపాలో చేరారు. తూర్పు దిల్లీ నియోజకవర్గం నుంచి ఎంపీగా గెలిచిన ఆయన.. స్థానికంగా కీలకంగా వ్యవహరించారు. త్వరలో జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో ఆయనకు టికెట్‌ దక్కకపోవచ్చనే వార్తల నేపథ్యంలో ఆయన ఈ పోస్ట్‌ చేయడం చర్చనీయాంశంగా మారింది.

లోక్‌సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల (Lok Sabha Candidates)ను ఖరారు చేసేందుకు పీఎం మోదీ(PM Modi) సారథ్యంలో పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ (సీఈసీ) రెండురోజుల క్రితం సమావేశం నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏ క్షణమైనా ఆ జాబితా విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రధాని మోదీ, కేంద్రమంత్రి అమిత్‌ షాతో సహా సుమారు వంద మందికి పైగా అభ్యర్థులతో ఆ లిస్ట్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.

త్వరలో జరగబోయే ఐపీఎల్‌ సీజన్‌లో కోల్‌కతా నైట్‌రైడర్స్‌కు మెంటార్‌గా వ్యవహరించనున్న సంగతి తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని