Aadhaar: ఆఫ్‌లైన్‌లో ఆధార్ తనిఖీకి సరికొత్త మార్గదర్శకాలు
ఆధార్ తనిఖీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీచేస్తూ భారత విశిష్ట ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) మంగళవారం ఒక ప్రకటన చేసింది.
జారీ చేసిన యూఐడీఏఐ
దిల్లీ: ఆధార్ తనిఖీకి సంబంధించి కొత్త మార్గదర్శకాలను జారీచేస్తూ భారత విశిష్ట ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) మంగళవారం ఒక ప్రకటన చేసింది. ఆఫ్‌లైన్ వెరిఫికేషన్ చేసే సంస్థలు(ఓవీఎస్‌ఈ) కచ్చితంగా మెరుగైన భద్రత ప్రమాణాలను పాటించాలని సూచించింది. దీనివల్ల ఆధార్ భద్రతపై ప్రజల్లో నమ్మకం పెరగడంతో పాటు ఆధార్‌ను స్వచ్ఛందంగా సమర్పించేందుకు ముందుకువస్తారని అభిప్రాయపడింది.
కీలకమైన సూచనలివీ...
* ఓవీఎస్‌ఈలు ఆఫ్‌లైన్ ధ్రువీకరణ చేసే ముందు ఆధార్ పొందిన వ్యక్తి అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. ఆధార్ భద్రత, గోప్యత గురించి వారికి భరోసా ఇవ్వాలి.
* భవిష్యత్తులో యూఐడీఏఐ లేదా ఇతర ప్రభుత్వ శాఖల పరిశీలన నిమిత్తం ప్రతి ధ్రువీకరణ వివరాలను సంబంధిత రికార్డులలో నమోదు చేయాలి.
* ఆధార్‌ను భౌతికంగా లేదా ఎలక్ట్రానిక్ పద్ధతిలో గుర్తింపునకు నిర్ధారణగా అంగీకరించటానికి బదులుగా నాలుగు విధాలుగా (ఆధార్ ప్రింట్, ఈ-ఆధార్, ఎం-ఆధార్, ఆధార్ పీవీసీ) జారీ చేసిన వాటిపై ఉన్న క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేసి ధ్రువీకరించుకోవాలి.
* ఆఫ్‌లైన్ ధ్రువీకరణ సమయంలో ఓవీఎస్‌ఈలు ఆధార్‌ను వెరిఫైచేయలేకపోతే...సదరు వ్యక్తికి సేవలు నిరాకరించకుండా, ప్రభుత్వం జారీ చేసిన మరేదైనా పత్రం సమర్పించి తన గుర్తింపును నిరూపించుకునేలా ప్రోత్సహించాలి.
* ఆధార్‌ను ఆఫ్‌లైన్‌లో వెరిఫై చేసే సంస్థలు ధ్రువీకరణ పూర్తయిన తర్వాత తమ వద్ద వినియోగదారులకు సంబంధించి ఎలాంటి వివరాలు భద్రపరచకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితిలో ఆధార్ కార్డు నకలును భౌతికంగా ఉంచుకోవాల్సి వస్తే వివరాల గోప్యతను కాపాడేలా మాస్క్‌డ్ ఆధార్‌ను మాత్రమే అనుమతించాలి.
* ఆఫ్‌లైన్ తనిఖీలో భాగంగా ఆధార్‌లోని వివరాలు సరైనవి కావని గుర్తిస్తే, 72 గంటల్లోగా యూఐడీఏఐకి సమాచారం అందించాలి.
* ఓవీఎస్‌ఈలు ప్రభుత్వ వ్యవస్థల కోసం కాకుండా బయటి వ్యక్తులు, సంస్థల కోసం ఆఫ్‌లైన్ తనిఖీ చేయకూడదు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
British Airlines: ఇంత మోసమా.. ఎంతో ఆశతో విండో సీట్ బుక్ చేస్తే..!
-
India News
PM Modi: అలా అనే ధైర్యం ఎవ్వరికీ లేదు : మోదీ
-
Sports News
Anil Kumble: భారత క్రికెట్లో ఈ రోజు ఓ సంచలనం.. కుంబ్లేకు పాక్ జట్టు దాసోహమైన వేళ!
-
General News
Andhra News: ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.4,42,442 కోట్లు: కేంద్రం
-
Movies News
Allu arjun: ఫొటో షూట్ రద్దు చేసిన బన్నీ.. స్టేజ్ పైనే కన్నీళ్లు పెట్టుకున్న అభిమానులు
-
General News
Turkey Earthquake: ఆ రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గడిపాం: తుర్కియేలోని సిక్కోలు వాసులు